తెలుగు లో సీరియల్స్ కు కొదువే లేదు. అన్ని చానెల్స్ లోను సీరియల్స్ పోటాపోటీగా ప్రసారం అవుతూ ఇంటిల్లిపాదికి మంచి ఎంటర్టైన్ మెంట్ ను ఇస్తున్నాయి. సీరియల్ అనగానే చాలా మందికి ఒకవిధమైన అభిప్రాయం అనేది ఉంది. అభిప్రాయాలూ అనేవి వేరుగా ఉంటాయి కాబట్టి ఎవరికీ నచ్చిన సీరియల్స్ ను వాళ్ళు చూస్తుంటారు. ఇప్పుడున్న దాంట్లో మాటీవీ లో ప్రసారమయ్యే సీరియల్స్ ను  అత్యధికంగా చూస్తున్నట్లు సమాచాచారం. ఆ తర్వాత జీ తెలుగు నిలుస్తుంది.

ఇక విషయానికి వస్తే జీ తెలుగులో ఇటీవలే ఒక సరికొత్త  ధారావాహిక ప్రారంభం అయింది. ఆ సీరియల్ పేరే 'కృష్ణ తులసి'. ఈ సీరియల్ కు సంబంధించి జీ తెలుగు లో ఒక ప్రోమో లాంటిది ప్రసారం కావడం. అందులో హీరోయిన్ నలుపు రంగులో ఉండడం చూస్తే సీరియల్ నేపథ్యం కొంచం ఆసక్తికరం గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు మరియు ఆమె చేసే పాత్ర ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం .

కృష్ణ తులసి సీరియల్ మొత్తం శ్యామ అనే పాత్ర ఆధారంగా సాగనుంది . ఆ పాత్ర చేసింది ఎవరో కాదు కన్నడకి చెందిన ఐశ్వర్య. కన్నడలో యరివాలు అనే సీరియల్స్  ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య. తెలుగులో ఈమె కు ఇదే మొదటి సీరియల్ కావడం విశేషం . ఈ పాత్ర కోసం ఐశ్వర్య ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుందట. అతి త్వరలో కృష్ణ తులసి సీరియల్ జీ తెలుగు లో ప్రసారం కాబోతుంది .  ఇక ఈ సీరియల్ ని  ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్ర రావు నిర్మించడం విశేషం. ఈ సీరియల్ నచ్చిందని ముఖ్యంగా శ్యామ పాత్ర తనని బాగా ఆకట్టుకుందని అందుకని తామే స్వయంగా ఈ సీరియల్ ని నిర్మిస్తున్నట్లు అయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: