జగ్గయ్య.. ఇండస్ట్రీలో అలనాటి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. ఈయన నటించే ఏ సినిమా అయినా సరే మంచి విజయాన్ని అందుకోవాల్సిందే. ఇక ఈయన అసలు పేరు కొంగర జగ్గయ్య. 1928 వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన గుంటూరు జిల్లాలోని తెనాలిలో జన్మించారు. ఇక ఈయన కేవలం సినీ ఇండస్ట్రీలోకి నటుడిగా ప్రవేశించకముందే రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొందారు.. చూడడానికి హీరో కటౌట్ వున్న ఈయన.. రంగస్థలంపై నాటకాలు వేస్తే ఈయన కోసం ప్రేక్షకులు ఎగబడేవారు అట.. ఎక్కడ నాటకాలు జరిగినా ముందుగా పేరు వినిపించేది జగ్గయ్య మాత్రమే.

అలా ఈయన రంగస్థల నటుడిగా తన జీవితాన్ని మొదలు పెట్టి ,ఆ తరువాత నటుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా.. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి పార్లమెంటు సభ్యుడిగా ఇలా ఎన్నో రకాలుగా తనదైన శైలిలో తన ప్రతిభను అందరికీ కనపరిచారు.. ఈయన ఆకాశవాణి లో వార్తలు కూడా చదివి వినిపించేవారు.. ఇతని గంభీరమైన కంఠం కారణంగా కంచు కంఠం జగ్గయ్య గా, కళా వాచస్పతి గా గుర్తింపు పొందారు.ఇక  ఈయన వారసుడు సాత్విక్ కృష్ణ కూడా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్లో నటిస్తూ అందరినీ బాగా అలరిస్తున్నారు..

సాత్విక్ కృష్ణ ఎన్నో సీరియల్స్ లో నెగిటివ్ పాత్రలు పోషించి, తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.. ఇటీవల ముగిసిన అమ్మ సీరియల్ లో నెగటివ్ షేడ్ లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక తన తాత జగ్గయ్యను ఆదర్శంగా తీసుకొని, మొదటి సినిమా లోకి ప్రవేశించాడు .. అక్కడ ఎన్నో  సహాయక పాత్ర లో పనిచేసి, ఆ తర్వాత బుల్లితెరపై విలన్ గా అడుగు పెట్టాడు. ఇక ప్రస్తుతం ఎన్నో సీరియల్స్లో నటిస్తూ.. సాత్విక్ కృష్ణ  తాతకు తగ్గ మనవడిగా బుల్లితెరపై గుర్తింపు పొందుతున్నారు. ఇక జగ్గయ్య వారసుడిగా సాత్విక్ కృష్ణ మరిన్ని విజయాలను అందుకోవాలని మనం కూడా మనస్పూర్తిగా కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: