యాంకర్ సుమ బుల్లితెరపై తిరుగులేని మహారాణి అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే.. ఎందుకంటే ఈమెకు ఉన్నంత క్రేజ్ బుల్లితెరపై ఏ ఒక్కరికీ లేదని చెప్పవచ్చు. గతంలో కూడా సుమ పలు సినిమాలలో నటించింది. ఇక మూవీ ఈవెంట్స్ కు అయితే.. తన ఒంటి చేత్తో నడిపించగల దు. ప్రస్తుతం సుమంత్ కథానాయకుడిగా జయమ్మ పంచాయతీ అనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. యాంకర్ సుమ ఈ సినిమాని తనే దగ్గరుండి స్వయంగా ప్రమోట్ చేసుకుంటోంది. ఇక ఈ సినిమాకు స్టార్ హీరో లు అయినటువంటి రామ్ చరణ్, రానా వంటివారిని రంగంలోకి దింపింది.

ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ ను రామ్ చరణ్ తో , రానా తో మరొక ప్రమోషన్  కూడా చేయించింది. అయితే తాజాగా వినిపిస్తున్న మాట ఏమిటంటే.. ఈ సినిమా లో తాజాగా ఒక పాటకోసం రాజమౌళిని రంగంలోకి దింపే విధంగా ప్లాన్ చేసింది. కొన్ని గంటల క్రితం సినిమాకు సంబంధించి పాటను కూడా విడుదల చేయడం జరిగింది రాజమౌళి. ఈ పాటని సుమ స్వయంగానే పాడిందట. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఇక ఈ పాట తో ఈమె రెండవ సారి తన గానాన్ని వినిపించింది. ఇక విన్నర్ సినిమాలో ఒక పాటను పాడింది..మరి ఇప్పుడు తన చిత్రంలోనే పాడుకుంది.

ఈ సాంగ్ గురించి యాంకర్ సుమ తెలుపుతూ.. ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలోనే ఈ పాటను నేను పాడగలిగాను... ఈ పాటకు అద్భుతంగా ట్యూన్ కూడా చేయడం జరిగింది. రామజోగయ్య శాస్త్రి ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని అందించారని తెలిపింది. ఇక అంతే కాకుండా జెడి మాస్టర్ కొరియోగ్రాఫర్ సూపర్ గా ఉందని యాంకర్ సుమ చెప్పకనే చెప్పేసింది. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడుతున్న ట్లుగా కూడా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: