జబర్దస్త్ లో ఎంతోమంది కమెడియన్లు ఎంట్రీ ఇచ్చారు. ఇక అలాంటి వారిలో జబర్దస్త్ ప్రవీణ్ కూడా ఒకరు. కమెడియన్ గా ఎంతో గొప్ప పేరు కూడా సంపాదించారు. ఇక మొదట పటాస్ షో ద్వారా వెండితెరకు పరిచయమైన ప్రవీణ్.. ఈ షో తోనే మంచి పాపులర్ అయ్యాడు.అయితే ప్రవీణ్ పైమా కథ మాత్రం ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉందని చెప్పవచ్చు. ఇక వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. అయితే తాజాగా ఫైమా మాత్రం బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది. ప్రవీణ్ మాత్రం జబర్దస్త్ మీద సందడి చేస్తూ ఉన్నారు. ఇక ఫైమా కూడా నీ పెళ్లి ఎప్పుడు అంటూ బిగ్ బాస్ లో ఒక ప్రశ్న రాగా అసలు ఇప్పుడు నేను ప్రవీణ్ పక్కన ఉండాల్సింది అనే వార్తని తెలియజేసినట్లు సమాచారం.


అయితే ప్రవీణ్ వాళ్ళ తండ్రి చనిపోయారు ఈ సమయంలో నేను ప్రవీణ్ దగ్గర ఉండాలి కానీ వాడే నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారని తెలియజేసింది. బిగ్ బాస్ హౌస్ లో అవకాశం రావడం అంటే అదొక వరమనే తనని పంపించాడని తెలియజేస్తూ ఎమోషనల్ అయింది ఫైమా. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ లో ప్రోమో ఇప్పుడు విడుదలవడం జరిగింది. ఈ మేరకు అసలు విషయాన్ని బయట పెట్టడం జరిగింది.ప్రవీణ్ తన తండ్రి కోల్పోయానంటు చాల ఏడ్చేశాడు.. స్టేజ్ మీద కన్నీరు పెట్టుకుంటూ తనకు తల్లి కూడా లేదని అన్ని తానై చూసుకుంటున్నానని.. తన తండ్రి ఉన్నప్పుడు అన్ని బాధలు తన తండ్రితో చెప్పుకునే వాడినని ఇప్పుడు ఆ తండ్రి కూడా లేడని ప్రవీణ్ బోరున ఏడ్చేశాడు. ఇక తన తండ్రి జ్ఞాపకాలను తలుచుకుంటూ ప్రవీణ్ కన్నీరు మున్నీరయ్యారు. ఇక అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ్ బాధను చూసి హత్తుకొని భరోసా ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: