బిగ్ బాస్ సీజన్ 6 లో నాలుగవ వారం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే హౌస్ లో ఆట కోసం ఇంటి సభ్యులు పోరాడుతున్నారు. వారం వారానికి వారిలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇంతకు ముందు సీజన్ ల కంటే ఇందులో ఒక్క ఆశ్చర్యపడి విషయం ఏమిటంటే.. గతంలో అయితే నామినేషన్ వచ్చినా లేదా నామినేషన్ లో ఉన్నా చాలా భయపడిపోయేవారు. కానీ వీరిలో మాత్రం ఏమంత భయం లేదు, చాలా జాలీగా బిగ్ బాస్ హౌస్ కు ట్రిప్ కోసం వచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం గేమ్ ఆడుతున్నారు.. గేమ్ మాత్రమే ఆడుతున్నారు. వారిలో గీతు, రేవంత్, సూర్య, శ్రీహన్, ఫైమా మరియు ఇనాయ సుల్తానాలు ఉన్నారు. మిగిలిన వారు అంతా కూడా జస్ట్ చిల్ అవుతున్నారు.

ప్రతివారం లాగే ఈ వారం కూడా నామినేషన్ ఎపిసోడ్ చాలా రసాభాషగా జరిగింది. చివరికి అర్జున్ కళ్యాణ్, కీర్తి, రేవంత్, గీతు, ఆరోహి, ఇనయ, సుదీప, రాజ్ , శ్రీహన్ మరియు సూర్య లు ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి నుండే ఓటింగ్ లైన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు అధికారిక  మరియు అనధికారిక ఛానెల్స్ లో మరియు వెబ్సైట్ లో వచ్చిన ఓటింగ్ ప్రకారం రేవంత్ మొదటి స్థానంలో ఉండగా , ఇనయ మరియు శ్రీహన్ లు తర్వాత స్థానాలలో ఉన్నారు. ఇక ఆఖరి స్థానంలో ఆరోహి ఉంది... అయితే రోజు రోజుకి స్థానాల్లో మార్పులు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆరోహి మాత్రం చివరి స్థానంలోనే నిలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

ఈమె కేవలం గొడవలు , ఆర్గ్యుమెంట్ అప్పుడు మాత్రమే ఇంటి సభ్యులతో ఉంటుంది. మిగిలిన సమయం అంతా కూడా సూర్య తో ఉంటుంది. అయితే ఇదే ఆరోహి కి డేంజర్ గా మారే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా ఎవరైనా తన తప్పును చెబితే అంగీకరించకుండా, వ్యంగ్యంగా మాట్లాడడం, లెక్కలేని తీరు ఇవన్నీ ప్రేక్షకులలో ఓటీన్గ్ తగ్గేలా చేస్తున్నాయి. ఈవారం మిగిలిన మూడు రోజుల్లో తమ ఆటను మెరుగుపరుచుకోకపోతే ఆరోహి వెళ్లిపోవడం పక్కా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: