బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రస్తుతం నాలుగవ వారం జరుగుతోంది. గత రాత్రి జరిగిన ఎపిసోడ్ లో చంటి మరియు గీతు ల మధ్యన చిన్న గొడవ జరిగింది. బిగ్ బాస్ ఆదేశం మేరకు కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందులో కెప్టెన్సీ కి ఎంపికైన వారు మినహాయించి మిగిలిన వారంతా బజర్ మోగగానే ఎవరైతే ముందుగా అక్కడ ముందుగానే ఉంచిన బాక్సింగ్ గ్లోవ్ ను తాకుతారో, వారికి కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్న వారిలో నుండి ఒకరిని ఎలిమినేట్ చేసే పవర్ వస్తుంది. ఆ విధంగా ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అయితే ఒకసారి బజర్ మోగగానే చంటి గ్లోవ్ ను తీసుకుంటాడు. దీనితో ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని ఆలోచించి గీతు ను సెలెక్ట్ చేసుకుంటాడు.

అయితే ఇది తట్టుకోలేని గీతు వెంటనే చంటిని ఆట ఆడడం రానివాళ్లు కూడా ఇలా చేయడం కామెడీ గా ఉంది బిగ్ బాస్ అంటుంది. అయితే ఈ మాట ఛాతికి ఎక్కడో గుచ్చుకుంటుంది. ఇక తానేమీ తక్కువ తిన్నాడా అన్నారు అక్కడే వాదన పెట్టుకుంటాడు. కాసేపు అలా వాదన జరుగుతుంది.. అయితే ఈ గొడవలో తప్పు ఎవరిది అన్న ఆలోచన అందరికీ వచ్చి ఉంటుంది. వాస్తవానికి మొదటి నుండి వీరిద్దరికి అస్సలు పడడం లేదు. అందుకే దొరికిన అవకాశాన్ని చంటి వాడుకున్నాడు, ఆటలో భాగంగా చంటి చేసిన పనిని గీతు జీర్ణించుకోలేకపోయింది. ముఖ్యంగా కెప్టెన్ గా నువ్వు పనికిరావు అన్న విధంగా అర్ధం చేసుకుని చంటిపై అక్కసును వెళ్లగక్కింది.  

కానీ చంటిని అలా అనడం మాత్రం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో వీడియో లు పోస్ట్ చేసి మరీ కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాకుండా చంటిని ఉద్దేశించి అందరితో ముందు బాగుంటూ, వెనుకాల వారి గురించి చెడుగా మాట్లాడుతాడు అంటూ చెప్పింది. అంతటితో ఆగిందా... రేవంత్ కు చంటి తన గురించి అన్న మాటను చెప్పి శాడిజాన్ని బయట పెట్టింది. నిజంగా రాత్రి ఎపిసోడ్ తర్వాత తనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఖచితంగా తగ్గి ఉంటుంది. అలా చంటి మరియు గీతుకు జరిగిన గొడవలో గీతు తప్పు చేసింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: