
మరొకవైపు స్టార్ మా లో బిగ్ బాస్ జోడితో సూర్యతో కలిసి డాన్స్ లో ఇరగదీసిన ఈమె గత నెలలోనే కొత్తింటి గృహప్రవేశం చేసి తన కలను కూడా సహకారం చేసుకుంది. ఇకపోతే బిగ్ బాస్ కి వెళ్లి ఏడాది అగ్రిమెంటు పూర్తి కాగానే మరొకసారి జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. మళ్లీ జబర్దస్త్ స్టేజ్ పై కామెడీ చేయడానికి సిద్ధమయ్యింది. అది కూడా ఆమె బుల్లెట్ భాస్కర్ స్కిట్లోనే కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఇక వచ్చే శుక్రవారం జబర్దస్త్ స్టేజ్ పైన మళ్ళీ ఫైమా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి సిద్ధమవుతోంది.
ఈ విషయం తెలిసి ఫైమా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే మొన్నటి వరకు స్టార్ మా చానల్లో స్టార్ మా పరివార్ కార్యక్రమంలో శ్రీముఖితో కలిసి సందడి చేసిన ఫైమా ఇప్పుడు మళ్లీ తన మొదటి స్థానానికే చేరుకోబోతోంది ఇక్కడ తన సత్తా చాటుతూ మరొకసారి స్టార్ పొజిషన్కు చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది ఫైమా.. ఏదిఏమైనా ఈ ముద్దుగుమ్మ మళ్ళీ రీఎంట్రీ ఇస్తూ ఉండడం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.