తెలుగు బుల్లితెరపై ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకున్నటువంటి షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి.. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ప్రేక్షకులను బాగా నవ్వించడంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.. ఒకప్పుడు రికార్డు స్థాయిలో రేటింగ్ పరంగా దూసుకుపోయిన ఈ షో ఇప్పుడు ఫెయిల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంతోమంది కమెడియన్లు ట్రై చేస్తున్న ఈ షోని ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడంలో విఫలమవుతున్నారు. మరొకవైపు జబర్దస్త్ కామెడీ షో కి ఎన్నో పోటీగా షోలు వస్తున్నప్పటికీ కొత్త షోలు ఏవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.దీంతో జబర్దస్త్ షో కి కూడా త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోందని బుల్లితెర వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.దాదాపుగా పదేళ్లకు పైగా ప్రసారమవుతున్నటువంటి ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మధ్యకాలంలో మెప్పించడం లేదని చాలా వీక్ రేటింగ్ తో ప్రసారమవుతున్నట్లు సమాచారం.. ఈ రీజన్ వల్లే ఈ షోని త్వరలోనే ఆపేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ షో స్థానంలో మరో కొత్త షోని కూడా ప్రసారం చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.


గతంలో ఎంతోమంది కమెడియన్స్ జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఉండేటువంటి కొత్త కమెడియన్లతో ఈ షోని నెమ్మదిగా ముందుకు నెట్టుకు వస్తున్న రేటింగ్ పరంగా దారుణంగా ఉన్నట్లు సమాచారం.ముఖ్యంగా జడ్జిల విషయంలో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారట. గతంలో నాగబాబు రోజా చేసినట్టుగా ఎవరు చేయలేకపోతున్నారు. గతంలో చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, కిరాక్ ఆర్పి, ముక్కు అవినాష్ తదితర కమెడియన్లు సైతం ఉండేవారు కానీ ఈ మధ్యకాలంలో వీరందరూ జబర్దస్త్ వీడి పలు రకాల వాటిలో బిజీగా ఉన్నారు. చాలామంది కమెడియన్లను సైతం జబర్దస్త్ షో మార్చేసిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం దారుణమైన రేటింగ్ తో పడిపోవడంతో మల్లెమాల ఈ షోని ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: