కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి సీరియల్ ద్వారా ఊహించని పాపులారిటీ సంపాదించుకున్న వారిలో వైష్ణవి గౌడ కూడ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా తెలియక పోయినప్పటికీ..నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. జీ కన్నడ లో ప్రసారమయ్యేటువంటి సీతారాం సీరియల్ ద్వారా భారీ క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవి గౌడ. అయితే ఇప్పటి వరకు తనకి 300 పెళ్లి సంబంధాలు వచ్చాయని కొన్ని కారణాలవల్ల తాను ఆ పెళ్లి సంబంధాలను రిజెక్ట్ చేశానంటూ కూడా తెలియజేసింది. ఈ విషయం విని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


కన్నడ బిగ్ బాస్ షోలో పాల్గొన్న వైష్ణవి గౌడ ఈ విషయాలను సైతం తెలియజేసింది.తనకు 300 వరకు లవ్ మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి అంటూ కూడా తెలిపింది. తాను ఎప్పుడు తన మనసుకు నచ్చిన పనిని చేస్తానంటూ కూడా వైష్ణవి తెలిపింది. అన్ని సంబంధాలు వచ్చిన ఒక్క ప్రపోజల్ కూడా తనకి కనెక్ట్ కాలేదని.. తన ఎప్పుడూ కూడా తన మనసు చెప్పిన మాటకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానంటూ తెలిపింది.. ఎవరినైనా ప్రేమించాలంటే కచ్చితంగా వారి ముఖం చూడడం అవసరము.. ప్రేమ అంటే చూడకుండానే మొదలవుతుంది అంటూ వైష్ణవి తెలుపుతోంది.


బుల్లితెర సీరియల్స్ పైన కూడా వైష్ణవి గౌడ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకుంటోందట.తెలుగు సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చి  రాబోయే రోజుల్లో బిజీగా మారుతుందేమో అంటూ అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ తెలుగు సీరియల్స్ లో కనుక ఎంట్రీ ఇస్తే ఈమె ఫేట్ మారిపోతుందని అభిమానులు తెలియజేస్తున్నారు.ఏది ఏమైనా వైష్ణవి గౌడ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి అభిమానుల కోరిక మేరకు అటు పెళ్లి విషయంలో కానీ ఇది తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వడంలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: