టాలీవుడ్ ఇండస్ట్రీలో బిత్తిరి సత్తికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. తన కామెడీ టైమింగ్ తో మాట్లాడే మాటలతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారు.. బిత్తిరి సత్తి మాట్లాడే మాటలను ఎవరు ఇమిటేట్ చేయలేరని కూడా చెప్పవచ్చు.. గతంలో పలు సినిమాలలో నటించిన బిత్తిరి సత్తి ఎన్నో షోలకు యాంకర్ గా కూడా చేశారు.. తాజాగా జీ తెలుగు ఛానల్లో ఉగాది పండుగ కానుకగా ఉగాది ఉమ్మడి కుటుంబం అనే పేరుతో ఒకరు మొదలుపెట్టారు.. ఇందులో బిత్తిరి సత్తి కూడా కనిపించడం జరిగింది. అయితే ఇందులో తన పేరు వేలు స్వామి అని చెబుతూ ఎంట్రీ ఇచ్చారు.


ఆలీ గారికి ఏపీలో ఏం జరుగుతుందో చెబుతానని మేలో ఎండలు ఎక్కువగా వస్తాయని బిత్తిరి సత్తి చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు.. అలాగే హీరోయిన్ రాశి గారికి రాశి ఫలాలు చెబుతానంటు 2020 లోనే మీరు ఒక ప్రముఖ హీరో పైన చెయ్యి వేసుకుంటారని చెప్పానంటూ తెలిపారు.. నిజంగా వేసుకున్నారు చూడండి అంటూ మూవీ ఈవెంట్ వీడియోను బిత్తిరి సత్తి చూపించడం జరిగింది.. అలాగే ఈవెంట్లో శ్రీకాంత్ చేతిని రాశి పట్టుకోగా ఆ ఫోటోలు బిత్తిరి సత్తి చూపించినట్లుగా సమాచారం.


అలాగే ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్న మీ అన్నమయ్య సినిమా రిలీజ్ అంటూ బిత్తిరి సత్తి అలనాటి హీరోయిన్ కస్తూరి పైన  కామెంట్స్ చేశారు.. హీరోయిన్ ఇషా చావ్లా తో శుక్ర ఉంది బుధ ఉంది.. అని చెప్పగా మీకు ఒక కరువు ఎక్కువగా ఉంది అంటూ ఆమె రివర్స్లో కౌంటర్ వేయడం జరిగింది. అయితే వేణు స్వామిని వేలు స్వామి అని బిత్తిరి సత్తి ఇమిటేట్ చేసిన ఒక వీడియో నేటిజెన్లను సైతం బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది ఈ ప్రోమో 4 లక్షలకు పైగా వ్యూస్ రావడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా బిత్తిరి సత్తి ఇమిటేట్ చేసిన ఒక వీడియో నేటిజెన్లను సైతం బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: