భారతదేశంలో ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే ముందుగా రెండు స్పెసిఫికేషన్స్ ఖచ్చితంగా చూస్తారట. అవి ఏమిటి అన్న విషయానికి వస్తే... కెమెరా క్లారిటీ, మెగాపిక్సల్. ఈ విషయం తాజాగా సైబర్ మీడియా రీసెర్చ్ సర్వేలో తేలడం జరిగింది. ఇందుకు ముఖ్య కారణం వినియోగదారుల ఆలోచన తీరే అని పేర్కొన్నారు. ఫ్రంట్ కెమెరా ఎన్ని మెగాపిక్సెల్స్, రియర్ కెమెరా ఎంత క్లారిటీ ఫోటోలు తీస్తుంది అన్న విషయం తెలుసుకున్న తర్వాత కానీ వినియోగదారులు స్మార్ట్ ఫోన్ కొంటున్నారని ఈ సర్వేలో వెల్లడయింది.

 


ఇక దాదాపు 30,000 రూపాయలు అంతకంటే ఎక్కువ ధరలు ఉన్న స్మార్ట్ ఫోన్ వారు కూడా మెగాపిక్సెల్ నెంబర్ ను బట్టి కెమెరా పనితీరు ఉంటుందని వారి భావన అట. ఇక అలాగే 20000 నుంచి 30000  ధరలో ఫోన్ కొనాలనుకునే వారు కూడా ఫ్రంట్ కెమెరా పనితీరుకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తారు అని ఇండస్ట్రీ ఇంటెలిజెంట్ గ్రూప్, సిఎంఆర్ అధిపతి ప్రభు రామ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కొన్ని సందర్భాల్లో అయితే స్మార్ట్ ఫోన్ పనితీరు బాగలేదు అని కస్టమర్లకు తెలిసిన కూడా... వారు ఫ్రంట్ కెమెరా ఆశించి ఫోన్ కొన్నామని సమాధానం ఇవ్వడం విశేషం. దాదాపు 60 శాతం మంది ఫ్రంట్ కెమెరా పనితీరు బాగుంటేనే ఫోన్ కొనడానికి ముందుకు వస్తున్నారు అని సర్వేలో వెల్లడి అయ్యిందట. 

 


ఇక ప్రధాన నగరాలు అయినా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోలకత్త, ఢిల్లీ ప్రాంతాలలో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న 600 మందికి పైగా CMR సర్వే నిర్వహించడం జరిగింది. ఇక అంతే కాకుండా సర్వేలో వివిధ వాటిపై ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. నిజానికి చాలా మంది కెమెరా విషయంలో క్లారిటీగా ఉండాలని కొందరు మెమోరీ, ర్యం వంటి వాటిని కూడా చూస్తూ కొనుగోలు చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: