సూపర్ కంప్యూటర్ నుండి సూపర్ తీసివేస్తే మిగిలేది కంప్యూటరే. కానీ మామూలు కంప్యూటర్ కి సూపర్ కంప్యూటర్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. మామూలు కంప్యూటర్ లో చేయలేనివి ఎన్నో పనుల్ని మనం సూపర్ కంప్యూటర్ ఉపయోగించి చేయవచ్చు. ఎలా అంటే వాతావరణ అంచనాల్ని అంటే ఎప్పుడు వర్షాలు పడతాయి అని తెలుసుకోవచ్చు మరియు అంతరిక్ష విశేషాలను మరియు భూకంపాల విశ్లేషణ గురించి కూడా తెలుసుకోవచ్చు..

భారతదేశంలో విజయ్ పాండురంగ్ భట్కర్ అనే వ్యక్తి  పరం సూపర్ కంప్యూటర్ అభివృద్ధికి పునాది వేశారు ఆలా 1991 సంవత్సరం లోనే మొదటి పరం -8000 అనే సూపర్ కంప్యూటర్ ను  తయారుచేశారు. ఆ తర్వాత 1998వ సంవత్సరంలో పరం -10000 పేరుతో కొత్తగా అభివృద్ధి చేశారు. అప్పటినుండి  పరం సిరీస్ నుండి వచ్చిన శివాయ్ మరియు పరం-బ్రహ్మ, ప్రతుష్ ,మిహిర్  అనే సూపర్ కంప్యూటర్లు సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి... ఈ పరం సిరీస్ సూపర్ కంప్యూటర్స్ ని పూనేలోని C-DAC  చేత రూపొందించబడినవి. ఈ నేపథ్యంలో  పరం సిరీస్ సూపర్  కంప్యూటర్స్ అభివృద్ధి  లో కీలక పాత్ర పోచింనందుకు గాను  భారత ప్రభుత్వం పరం సూపర్ కంప్యూటర్ యొక్క  పితామహ అయినా  విజయ్ పి భట్కర్ ని పద్మశ్రీ మరియు పద్మభూషణ్ అవార్డులు ఇచ్చి సత్కరించింది...ప్రస్తుతం ఆయన ఎక్సస్కేల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు .  

సూపర్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాము కదా అసలు సూపర్ కంప్యూటర్ సృష్ట్టికర్త ఎవరు ? సేమౌర్ క్రే అమెరికాకి చెందిన ఇంజనీర్ .ఇతన్నే సూపర్ కంప్యూటర్ యొక్క తండ్రి అని పిలుస్తారు .భారతదేశం లో అత్యంత  వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది అంటే ప్రతుష్ సూపర్ కంప్యూటర్ .ఈ సూపర్ కంప్యూటర్ పూణే లో స్థాపించబడింది . ఇక ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది అంటే సమ్మిట్ సూపర్ కంప్యూటర్ ఇది అమెరికా లో ఉంది . ప్రపంచంలో శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లలో  చైనా దేశం ముందు వరసలో ఉంది . ఆ తర్వాత అమెరికా దేశం ఉంది ..  

మరింత సమాచారం తెలుసుకోండి: