రానున్న రోజుల్లో ప్రపంచం అంతా కలుషితమయం కావచ్చు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు ..దీనికి గల కారణం వాహనాల వాడకం ఎక్కువవడంతో పాటు విరివిగా వాహనాల నుంచి వెలువడుతున్న పొగ , అలాగే ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ మొదలగునవి.. ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు , అలాగే వాటికి తోడు ఇంధన ధరలు కూడా పెరిగిపోవడంతో కొన్ని కంపెనీ వారు ఎలక్ట్రిక్ వెహికల్స్ ను కనుగొన్నారు. అలాంటి దిగ్గజ కంపెనీలలో ఒకటి ఓలా కూడా ఈ సంస్థ ఒక ఓలా ఎలక్ట్రిక్ బైక్ ను ప్రకటించింది. ఇందుకోసం దేశంలోని దాదాపు 400 నగరాలలో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఓలా కంపెనీ వెల్లడించింది.
జూలై నెల నుంచి తమ అమ్మకాలను ప్రారంభిస్తున్నట్టు ఓలా గ్రూప్ సీఈఓ భవిశ్ అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాదిలో దేశంలో ఉన్న 100 నగరాలలో 5,000 చార్జింగ్ పాయింట్లను ఓలా ఏర్పాటు చేయనుంది. కొద్దికొద్దిగా పెంచుకుంటూ 400 నగరాలలో లక్ష పాయింట్లను ఏర్పాటు చేయనుంది ఈ సంస్థ. అంతేకాకుండా తమిళనాడులో ప్రారంభించనున్న ఫ్యాక్టరీ జూన్ కల్లా సిద్ధం కానున్నట్లు ఓలా సంస్థ వెల్లడించింది.
ఎలక్ట్రిక్ వాహనాలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 20 శాతం క్షీణించాయి. ఇదిలా ఉంటే ఒక టైంలో మార్కెట్ ని ఏలిన బజాజ్ చేతక్ ఆ తర్వాత క్రమంగా కనుమరుగైంది. అదే బజాజ్ కంపెనీ తెచ్చిన పల్సర్,డిస్కవర్,ప్లాటినా,సిటీ 100 వంటి మోడల్స్ ను కొనేందుకు సామాన్య ప్రజలు మొగ్గు చూపక పోవడంతో ,చేతక్ ఉత్పత్తికి ఆపేసింది. ఇప్పుడు దేశంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉండటంతో ఎక్కువమంది పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాలు వైపు దృష్టి మళ్ళించారు. ఇదే క్రమంలోనే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. దీంతో బజాజ్ కూడా పాత మోడల్ చెందినటువంటి చేతక్ మోడల్ ను కూడా రీ మోడల్ చేసి ఎలక్ట్రిక్ వాహనం గా మార్చి మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
ముందస్తు బుకింగ్ చేసుకునేందుకు 2,000 రూపాయలతో బుకింగ్ ఈ నెల 13న ప్రారంభించగా , భారీ రెస్పాన్స్ వచ్చింది. తొలివిడత ఉత్పత్తి చేసే వాహనాల కంటే అధిక బుకింగ్స్ వచ్చాయి .దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సంస్థలను బుకింగ్ ఆపేసింది. ఇక ఊహించని డిమాండ్తో బజాజ్ కూడా డిమాండ్ ను తీర్చడానికి ఉత్పత్తి శ్రేణి పెంచుతోంది. అంతే కాకుండా తన డీలర్షిప్ సెంటర్లను కూడా విస్తృతం చేయాలని నిర్ణయించుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి