
బజాజ్ ఫైనాన్స్ కార్డు , పై వివో బ్రాండ్ కలిసిపోయి మరికొన్ని ఆఫర్లను కూడా ప్రకటిస్తోంది. దీంతో బజాజ్ కార్డు ఉన్న వారికి 101 రూపాయలకే మొబైల్ ని సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటుగా 10% వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ని పొందవచ్చు. జియో కస్టమర్ లకు దాదాపుగా పది వేల రూపాయల వరకు కొన్ని బెనిఫిట్స్ ను తెలుపుతోంది.
ఒక మొబైల్స్ విషయానికి వస్తే VIVO X70,VIVO V21,VIVO Y33,VIVO Y73 ఈ మొబైల్స్ పై ఈ ఆఫర్ లను వర్తిస్తాయి. VIVO X 70 మొబైల్ ని తీసుకోవాలనుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ , కొటక్ మహీంద్రా బ్యాంకు నుండి ఫైనాన్షియల్ సర్వీసెస్ ను కూడా అందిస్తోంది. ఇందులో 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
బజాజ్ కార్డ్ ఉన్న వారికి కేవలం 101 రూపాయలను చెల్లించి మీరు మొబైల్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం 15000 రూపాయల కంటే ఎక్కువ రేటు ఉన్న మొబైల్ కే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అటు పిమ్మట నో కాస్ట్ EMI సదుపాయాన్ని కల్పిస్తోంది.VIVO Y73,VIVO Y 33 మొబైల్స్ పై ఏ బ్యాంకు కార్డ్ నుంచైనా తీసుకుంటే..2,500 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఈ ఆఫర్ లు మీకు లభించాలంటే వివో ఇండియా స్టోర్ లోనే ఈ మొబైల్ ను కొనుగోలు చేయాలి. అంతేకాకుండా ఈ కామర్స్ సైట్లలో కూడా ఈ ఆఫర్ లు వర్తిస్తాయి. మీ దగ్గర ఉండేటటువంటి VIVO స్టోర్ లో కూడా ఈ ఆఫర్ లు లభిస్తాయి. ఇటువంటి ఆఫర్ ను వచ్చే నెల 7వ తేదీ వరకు ఉంచనున్నట్లుగా ఈ సంస్థ తెలిపింది.