పసి పిల్లలు ఎక్కవగా పాలను తాగుతారు.అయితే ఒక్కో కాలంలో ఒక్కో విధంగా పాలు ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ లో అయితే పాలు కాచిన కొద్ది సేపటికే విరిగి పోవడం జరుగుతుంది.దాంతో తల్లులు మళ్ళీ కొత్తగా పాలను కాగ బెట్టాలి.ఇప్పుడు అలా కష్ట పడాల్సిన అవసరం లేకుండా సరికొత్త డివైజ్ ను నిపుణులు మార్కెట్ లోకి విడుదల చేశారు..మిల్క్ వార్మర్ పేరుతో ఒక పరికరం అందుబాటులో ఉంది. ఒకవేళ ఏ అర్ధరాత్రో వారికి ఆకలేసి ఏడిస్తే.. అప్పటికప్పుడు పాలు కాచి, చల్లార్చి తాగించాలంటే చాలా సమయం పడుతుంది. ఓ పక్క వాళ్ల ఏడుపు.. మరో పక్క మిగిలిన వారికి నిద్రాభంగం.. ఇలా అన్ని సమస్యలకు చెక్‌ పెడుతుంది.


ఈ డివైజ్ గురించి ఒకసారి చుద్దాము..ఇందులో రెండు పాల బాటిల్స్‌ను కూల్‌గా ఉంచి, పాలు విరిగిపోకుండా స్టోర్‌ చేయడంతో పాటు ఐదే ఐదు నిమిషాల్లో గోరువెచ్చటి పాలను అందిస్తుంది. ఈ డివైజ్‌ను బెడ్‌ రూమ్‌లోనే పవర్‌ సాకెట్‌ దగ్గర అమర్చుకుని.. స్విచ్‌ ఆన్‌ చేసుకుని పెట్టుకుంటే చాలు. డివైజ్‌ వెనుకవైపు భాగం ప్రత్యేకమైన మూత కలిగి ఉంటుంది. దానిలో రెండు పాల బాటిళ్లను ఉంచితే ఏ కాలంలోనైనా చల్లగా నిలువ ఉంటాయి..పాలు విరగకుండా ఈ పరికరం చూస్తుంది.అయితే కొందరు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.


బిడ్డ ఏడవడం మొదలుపెట్టిన వెంటనే.. అందులోని ఒక పాల బాటిల్‌ను ముందువైపు చిత్రంలో ఉన్న విధంగా పెట్టు కోగానే.. 5 నిమిషాల్లో పాలు వేడెక్కుతాయి. భలే ఉంది కదూ? ఈ డివైజ్‌ బెడ్‌ రూమ్‌లో ఉంటే.. ఎప్పుడుపడితే అప్పుడు కిచెన్‌లోకి వెళ్లాల్సిన పనిలేదు. పిల్లలు పాలకోసం ఎక్కువ సేపు వేచి చూడాల్సిన అవసరమూ ఉండదు. గోరు వెచ్చగా ఉండే పాలను పిల్లలకు అందించడానికి ఇది చక్కగా ఉపయోగ పడుతుంది.. దీన్ని అమెరికాలో మొదటగా విడుదల చేశారు.అక్కడ దీని ధర 108 డాలర్లు..మన ఇండియన్ రూపాయల వచ్చి 8,249 రూపాయలు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: