వావ్.. నోకియా నుంచి అదిరిపోయే ఫీచర్ ఫోన్! నోకియా 1100 ఈఫోన్ గురించి చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు చాలా మంది ఈఫోన్ నే వాడే ఉంటారు.ఇంకా ఇప్పటికి కొంత మంది తాము వాడిన మొదటి ఫోన్ అంటూ దీనిని గుర్తుగా ఉంచుకున్న వాళ్లు లేకపోలేదు. ఇప్పుడు దీనిని ఎందుకనుకుంటున్నారా.. అయితే నోకియా 1100 తరహలో సరికొత్త టెక్నాలజీతో అందరికీ అందుబాటు ధరల్లో నోకియా మరో ఫీచర్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. నోకియా 110(2022) మోడల్ ఫోన్ మనదేశంలో మొత్తం మూడు రంగుల్లో లభ్యమవుతోంది. రంగుల ఆధారంగా ఫోన్ ధరలో స్వల్ప మార్పులు అనేవి ఉన్నాయి. సియాన్ ఇంకా చార్ కోల్ రంగుల్లో అయితే రూ.1699గా, రోజ్ గోల్డ్ వేరియంట్ ధరను రూ.1799గా కంపెనీ నిర్ణయించింది.ఇక ఈఫోను కొనుగోలుచేస్తే రూ.299 విలువైన ఇయర్ ఫోన్స్ ను ఉచితంగా పొందొచ్చు.


నోకియా 110 (2022)లో స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే.. నోకియా కంపెనీ విడుదల చేసిన ఈకొత్త ఫోనులో ఆటో కాల్ రికార్డింగ్ ఆప్షన్ తో పాటు వెనుక వైపు ఇన్ బిల్ట్ రేర్ కెమెరా, ఇంకా టాప్ ఎడ్జ్ లో ఎల్ ఈడీ ఫ్లాష్ లైట్ ఉన్నాయి. వీటితో పాటు మ్యూజిక్ ప్లేయర్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా మైక్రో ఎస్ డీ కార్డు స్లాట్ అందుబాటులో ఉండగా..దీని ద్వారా ఫోన్ డేటా స్టోరేజిని 32 జీబీ వరకు కూడా పెంచుకోవచ్చు. స్నేక్ గేమ్ సహా మరికొన్ని గేమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వైర్ లెస్ ఇంకా వైర్డ్ ఎఫ్ ఎం రేడియో వంటి ఎన్నో ఫీచర్లు ఈఫోన్ లో ఉన్నాయి. అలాగే 1000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని ఈఫోన్ కలిగి ఉంది.మొత్తం 8వేలకు పైగా పాటలను స్టోర్ చేసుకునే సామర్థ్యం ఈఫోన్ కు ఉందని కంపెనీ తెలిపింది.అలాగే


మరింత సమాచారం తెలుసుకోండి: