ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ప్రపంచంలో యాపిల్ మొబైల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో చాలామంది ఎక్కువగా యాపిల్ బ్రాండ్ కు సంబంధించి మొబైల్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. యాపిల్ బ్రాండ్లో ఐఫోన్ కే ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో తెలిసిన విషయమే. యాపిల్ సిరీస్ లో కొత్త మొబైల్ విడుదలవుతోందంటే చాలు ఆ వెంటనే మొబైల్ కొనుగోలు చేయాలని ఎంతోమంది కస్టమర్లు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కువమంది యాపిల్ మొబైల్ ఉపయోగించాలని ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని ధరను చూసి వెనుకడుగు వేస్తూ ఉంటారు.


ముఖ్యంగా యాపిల్ మొబైల్ లో అధునాతన ఫీచర్స్ ఉండడమే కాకుండా ధరలు కూడా ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ఐఫోన్ మొబైల్ కొనాలి అంటే లక్షలలో ఖర్చు చేయాల్సిందే ఇదంతా ఇలా ఉండగ యాపిల్ వినియోగదారులకు తాజాగా శుభవార్త తెలియజేస్తోంది.. అదేమిటంటే రాబోయే రోజుల్లో భారత్ లో యాపిల్ మొబైల్ భారీగా తగ్గిపోతున్నట్లు సమాచారం. ఎందుచేత అంటే భారత్లో ఐఫోన్ మొబైల్ తయారీలో మొదలు కాబోతున్నాయి. ప్రముఖ దేశ వ్యాపారి దగ్గర సంస్థ ఆయన టాటా భారత్లో యాపిల్ మొబైల్ ను తయారు చేయబోతోంది ఇందుకోసం ఇప్పటికే పలు కసరత్తులను కూడా ప్రారంభించినది.

స్థానికంగా ఈ మొబైల్ తయారీ జరిగితే.. యాపిల్ మొబైల్ ధరలు భారీగా తగ్గబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ఐఫోన్ తయారీ ప్లాంట్ టాటా కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కానీ దాని విలువ దాదాపుగా రూ.5000 కోట్ల ఉంటుందని అంచనా. కర్ణాటకలో ఉండేటువంటి విస్ట్రాన్ కంపెనీ కి చెందిన ప్లాట్లు ఇప్పటికే ఐఫోన్ మొబైల్స్ తయారవుతున్నాయి. ఇక ఇందులో తైవాన్ దిగ్గజ సమస్త విస్టోన్, ఫాక్స్ కాన్ టెక్నాలజీతో భారత్ లో చైనాలో ఐఫోన్లను తయారు చేస్తోంది దీంతో టాటా గ్రూప్ విస్టంతో ఒప్పందం కూల్చుకున్నట్లుగా తెలుస్తోంది ఈ డీల్ కానక ఒకే అయితే.. ఐఫోన్ మొబైల్స్ పైన సుమారుగా రూ.30 నుంచి 50 వేలకు తగ్గే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: