ప్రస్తుతం ఉన్న రోజుల్లో మొబైల్ అనేది మానవుని జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంటర్నెట్ బ్రౌజ్ నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు ప్రతి ఒక్కటి కూడా మనం మొబైల్ లోనే ఉపయోగిస్తూ ఉన్నాము. అయితే చాలాసార్లు మనం మొబైల్ నెంబర్ ని మర్చిపోయిన సందర్భాలు ఉండనే ఉంటాయి. దీంతో మీ మొబైల్ నెంబర్ కూడా మర్చిపోయి నట్లయితే ఎవరు భయపడాల్సిన పనిలేదు.. ఈ నెంబర్ ని మీ మొబైల్ నుంచి చాలా సులభంగా కనుక్కోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి వాటి గురించి చూద్దాం.

USSD:
వేరు వేరు టెలికాం సర్వీసులు కంపెనీలకు సంబంధించి USSD కోడిని ఉపయోగించడం వల్ల మీ మొబైల్ నెంబర్లని సులువుగా కనుక్కోవచ్చు.. AIRTEL.. *282#..BSNL*99#..JIO*1#..VODAFONE..112#..IDEA 1214#.. ఈ కోడ్లను డయల్ పాడ్ ద్వారా ఉపయోగించి మెనూ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ నెంబరు ఎంపిక చేసుకుంటే మన మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది.

ఇక మరొక పాయింట్ ఏమిటంటే మై అకౌంట్ యాప్ ను ఉపయోగించడం వల్ల కూడా మీరు మీ మొబైల్ నెంబర్ ని చూడవచ్చు. మై అకౌంట్ అప్లికేషన్ ని కలిగి ఉన్నవారు మాత్రమే మీ మొబైల్ నెంబర్ ని తెలుసుకోవచ్చు  దీని కోసం ప్లే స్టోర్లో ఆపిల్ స్టోర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

USSD, మై అకౌంట్ యాప్స్ లేకపోతే మీ టెలికాం కంపెనీని సంప్రదించడం వల్ల కూడా మీ మొబైల్ నెంబర్ ని ఈజీగా కనుక్కోవచ్చు. దీని కోసం కంపెనీ సంబంధించి కస్టమర్ కేర్ నెంబర్ కు కాల్ చేసి మీ మొబైల్ నెంబర్ ని మర్చిపోయామని చెప్పగా.. మీరు ఇచ్చిన ఫ్రూపుల ఆధారంగా కంపెనీ మీ చిరునామా పుట్టిన తేదీ వంటి వాటిని తెలుసుకున్న తర్వాతే పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. అయితే మీరు కంపెనీకి అందించిన ఆధారంగా మాత్రమే మొబైల్ నెంబర్ను మీకు తెలియజేస్తుందని విషయాన్ని గుర్తుంచుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: