మెసి క్యుర్రిన్ అనే ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తన పొడవైన కాళ్లతో గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కేసింది. చిన్న వయస్సులోనే 6 అడుగుల 10 ఇంచుల పొడవున్న ఈమె బాస్కెట్ బాల్లో రష్యాన్ బాస్కెట్ బాల్ టీమ్‌కు చుక్కలు చూపించింది. ఆమె పొడవును చూసి.. గిన్నీస్ రికార్డు అధికారులే ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమె కాళ్ల కొలతలు తీసుకుని.. ప్రపంచంలో మరెవ్వరికీ అంత పొడవైన కాళ్లు లేవని తేల్చేశారు. ఇంతకీ మెసి కాళ్ల పొడవు ఎంతో తెలుసా? 4 అడుగుల 5 ఇంచులు. అంటే.. ఆమె శరీరంలో సగం కంటే ఎక్కువ కాళ్లే ఉన్నాయన్నమాట.