న్యూపోర్ట్కు చెందిన 38 ఏళ్ల క్రిస్టోఫర్ నాడెన్ అనే వ్యక్తికి ఇది అస్సలు నచ్చలేదు. దీంతో నాడెన్ తన నిరసన వ్యక్తం చేసేందుకు దుస్తులన్నీ విప్పేసి మాల్లోకి ఎంటరయ్యాడు. ఇదంతా అతడి భార్య మొబైల్లో రికార్డ్ చేసింది. అతడు అలా అర్ధనగ్నం రావడం చూసి సెక్యూరిటీ సిబ్బంది షాకయ్యారు. దుస్తులు వేసుకుని వస్తేనే ప్రవేశం ఉంటుందని చెప్పేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము దుస్తులు విక్రయించడం లేదని, మీరు ఇలా దుస్తులు విప్పేసి షాపింగ్ చేయరాదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. దీనిపై మీరు ప్రభుత్వాన్నే ప్రశ్నించాలని, మా వద్ద నిరసన వ్యక్తం చేయడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు.