కొత్తగూడెంలో పోలీసు అధికారి కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఇతడు ఇటీవలే లండన్ నుంచి ఇండియాకు వచ్చాడు.. దీంతో పోలీసు శాఖలో కలవరం మొదలైంది. కాగా తన కుమారుడు విదేశాల నుంచి వచ్చిన విషయం దాచిపెట్టిన అంశంలో కొత్తగూడెం పోలీసు అధికారిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అతడి కుటుంబ సభ్యులను హైదరాబాద్ తీసుకొచ్చి క్వారంటైన్‌లో ఉంచారు. కాగా ఆ కొత్త గూడెం డీఎస్పీ కుమారుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే..

 

 

ఇదిలా ఉండగా డీఎస్పీ కుమారుడు తనపై, తన కుటుంబంపై ఎన్నో వదంతులు వస్తున్నాయని, అవన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేశారు. ఇకపోతే కరోనా పాజిటివ్‌గా తేలిన తాను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాననే వార్త తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, తమ ఇంట్లో పని చేసే ఆంటీని కూడా పోలీసులు వల వేసి పట్టుకున్నారని అంతా తప్పుడు వార్తలు వ్యాపిస్తున్నాయని చెప్పారు. ఇల కొందరు మూర్ఖంగా చేస్తున్న ప్రచారం వల్ల తన కుటుంబంలో, బంధువర్గంలో ఆత్మవిశ్వాసం దెబ్బ తింటోందని, అందరూ కంగారు పడుతున్నారని, దయ చేసి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని అందరికి విజ్ఞప్తి చేశారు.

 

 

గాంధీ వైద్యులు చికిత్స బాగా అందిస్తున్నారని చెప్పారు. తనతో పాటు, తన తండ్రి డీఎస్పీ అలీ, తమ ఇంట్లో పని చేసే మహిళ కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారని తాను చేసిన వీడియోలో స్పష్టం చేశారు. ఇక ఈ వీడియో చేయడం కాస్త ఇబ్బందికరంగా ఉన్నా భయపెట్టేలా మీరు చేస్తున్న ప్రచారాల వల్ల నాలాగే ఎందరో మానసిక వేదన అనుభవిస్తున్నారు.. అందువల్ల నేనే స్వయంగా వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: