అమెరికా తదితర దేశాల్లో ఏటా అక్టోబరు నెలలో జరుపుకొనే ‘హాలోవీన్’ పండుగ ప్రభావం ఇది. ఈ నెల మొత్తం అక్కడి ప్రజలు వివిధ రకాల దెయ్యాల వేషాలతో అలరించడమే కాదు. కొన్ని క్రియేటీవ్ ఐడియాలతో ఆకట్టుకుంటారు. ఇళ్ల ముందు గుమ్మడికాయతో తయారు చేసిన లాంతర్లు మాత్రమే కాకుండా.. దెయ్యాలను తలపించే బొమ్మలను కూడా పెడతారు. చూసేందుకు అవి దెయ్యం బొమ్మేలే, కానీ.. అవి భలే ముద్దొస్తాయి. అకస్మాత్తుగా చూస్తే మాత్రం గుండె జారి చేతిలోకి వచ్చేస్తుంది.
సోషల్ మీడియా సైట్ ‘రెడిట్’లో పోస్టు చేసిన ఈ ఫొటోలో ఓ అస్థిపంజరం ఇంటి ముందు టేబుల్, కుర్చీ వేసుకుని తన ల్యాప్‌టాప్‌లో చాలా సీరియస్ వర్క్ చేసుకుంటోంది. మరోవైపు.. దానికి ఎదురుగా ఉన్న పెద్ద స్క్రీన్‌లో తన తోటి అస్థిపంజరాలతో ఆన్‌లైన్లో మీటింగులో మాట్లాడుతోంది. దీంతో నెటిజనులకు ఈ ఫొటో తెగ నచ్చేసింది. ప్రస్తుత సందర్భానికి తగినట్లుగా వాటిని ఏర్పాటు చేశారని, అవి చాలా సహజంగా అనిపిస్తున్నాయంటూ...ప్రస్తుతం అది నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఇలాంటి ఆసక్తికరమైన వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరిన్ని వైరల్ వార్తలు తెలుసుకోండి....
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి