కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఎందుకంటే ఆ పేరు తెలియని దేశం గాని,ప్రజలు గాని వుండరు.ప్రతి ఒక్కరికీ రోజులో కనీసం పదిసార్లయినా ఇది గుర్తుకొస్తుంది.. అయితే, ఇప్పటివరకు ఇది కేవలం వైరస్ పేరు మాత్రమే అని మనం భావిస్తున్నాం కదా. అయితే, కరోనాను పేరుగా కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారని ఇటీవల తెలుస్తోంది.

అయితే కరోనా పేరుతో మొన్నటి వరకు కొన్ని షాపులు, హోటళ్లకు ‘కరోనా’ పేర్లు ఉన్నాయని తెలిసింది. తాజాగా.. మనుసులకు కూడా ఆ పేరు వుంటుందని తెలుసా.. నిజంగానే ఆ పేరుతో వున్నారు. కేరళకు చెందిన ఓ మహిళకు పేరు కరోనా అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె పేరు 'కరోన థామస్' కొల్లాం కార్పొరేషన్ ఎన్నికల నేపద్యంలో మిథాలీ వార్డ్ లో బి‌జే‌పి తరుపున పోటీ చేస్తుంది.ఆమె పేరు కరోనా కావడంతో ఎన్నికల ప్రచారంలో ఆమెకు ఊహించని స్పందన వస్తోంది.

 జనాలు ఆ పేరుతోనే ఆమెను పలకరిస్తున్నారు.చిత్రం ఏమిటంటే.. కరోనా వైరస్ ఇండియాలో వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆమె.. ఆమె ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే, అప్పట్లో ఆమె పేరు కరోనా అనే సంగతి ఎవరికీ తెలీదు. బీజేపీ అభ్యర్థినిగా స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగిన తర్వాతే ఆమె పేరు ఫేమస్ అవుతోంది ఉచిత పబ్లిసిటీ వచ్చింది.మరి ఆమె పేరు కరోనా కాబట్టి ప్రజలు దూరం పెడతారా లేక ఆమె చెప్పటిన కార్యక్రమాలను చూసైన ప్రజలు ఓట్లు వేస్తారా అన్నది చూడాలి. . 

మరింత సమాచారం తెలుసుకోండి: