ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..దేవుడు ప్రపంచాన్ని చాలా అందంగా నిర్మించాడు.. ఎంత అందంగా అంటే ఈ విశ్వంలో అన్నిటికంటే ఎంతో అందంగా ఉండేలా భూమిని చెక్కాడు. ఈ భూమి మీద  చాలా అందమైన జీవ రాశులని సృష్టించాడు.అనేకమైన అందమైన ప్రదేశాలని సృష్టించాడు దేవుడు. అలాంటి అందమైన ప్రదేశాల్లో చెప్పుకోదగ్గ ప్రదేశం ఎడారి. ఎడారి ఎంత అందంగా ఉంటుందో తెలిసిందే.. ఎడారి లో ఇసుక తప్ప ఏమి ఉండదు కాని ఎడారి చాలా అందంగా ఉంటుంది. అప్పుడప్పుడు దేవుడు కొన్ని వింత కార్యాలు చేస్తాడు. అలాంటి వింతకార్యాల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం ఇది నమ్మశక్యం కాని వింత. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక అసలు విషయానికి వస్తే.డారి లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే సంగతి తెలిసిందే. ఎటు చూసినా ఇసుక మాత్రమే ఉండే సహారా ఎడారిలో  పొరపాటున దారి తప్పితే.. ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవల్సిందే. కనుచూపు మేరలో.. ఎక్కడా నీటి చుక్క కూడా దొరకని ఆ ప్రాంతంలో ఒంటెలు, కొన్ని రకాల పాములు, జంతువులు మినహా మరే ప్రాణీ జీవించలేదు.


మరి, అలాంటి ఎడారిలో మంచు వర్షం  కురిస్తే.. హిమాలయాల తరహాలు స్వేత వర్ణం పులుముకుంటే? భలే చిత్రంగా ఉంటుంది కదూ! సహారా ఏడారిలో ఇటీవల మైనస్ 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సందర్భంగా అల్జేరియాలోని ఎయిన్ సెఫ్రాలో మంచు వర్షం కురిసింది. కరీం బౌచేటాట అనే ఫొటోగ్రాఫర్ ఈ అరుదైన చిత్రాలను తన కెమేరాలో బంధించాడు. అనంతరం ఆ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. చిత్రకారుడు గిసీన అందమైన చిత్రాల్లా.. ఇసుక మీద తెల్లని మంచు గీతలు భలే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆ చిత్రాలను చూస్తే మీరు కూడా ఈ లోకాన్ని మరిచిపోతారు. ఫొటోలను ఈ కింది ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..






మరింత సమాచారం తెలుసుకోండి: