చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ రాజకీయ నాయకులకు ఎంత గుర్తింపు ఉంటుందో అదేవిధంగా కలెక్టర్లకు  కూడా అంతే గుర్తింపు ఉంటుంది. ఈ కలెక్టర్ పదవిలో ఉన్నవారు ఎంతోమంది మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఈ పదవిని బ్రిటిషర్లు ఏర్పాటు చేశారు. ఈ పదవిలో కలెక్టర్లు మన సొసైటీ నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందుతున్నారు. అయితే కలెక్టర్ అన్న అహంకారం కూడా కొంత మందిలో ఉంటుంది. కొంతమందిలో అందరినీ సమానంగా చూసే గుణం కూడా ఉంటుంది.


 ఇలా కలెక్టర్లు అయిన వారిలో చాలా మంది ఈ దేశానికి ఎనలేని సేవ చేసి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కలెక్టర్ ల లో తలబిరుసు తనంతో వర్తించే వారు ఉంటారు. ఏ పని చేయాలన్నా నేను ఏంటి నా స్థాయి ఏంటి అది నేను తీయడం ఏంటి అని రివర్స్ అవుతుంటారు. అలాంటిది కలెక్టర్ మాత్రం పదవి ని పక్కనపెట్టి సామాన్యురాలు అయిపోయారు. తన కారు టైరును తానే మార్చుకున్నారు. అందుకే అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు.


అక్కడి మైసూర్ జిల్లా కలెక్టర్ గా చేస్తున్నారు రోహిణి సిందూరి. తెలుగు మహిళ అయిన ఆమె వారం కిందట కొడుగు ఆ చుట్టు పక్కల పర్యాటక ప్రాంతాలు చూసేందుకు కార్లో వెళ్లారు. తనే స్వయంగా కారు డ్రైవ్ చేశారు. మార్గమధ్యలో కారు టైరు పంచర్ అయింది. అలాంటప్పుడు ఆమె కలెక్టర్ కాబట్టి ఒక ఫోన్ కొడితే మరొక కార్ వచ్చేస్తుంది. అందులో  హాయిగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆమె అలా చేయలేదు.


 అధికారిక పర్యటన కాదు కాబట్టి సొంత పని కాబట్టి తానే స్వయంగా కారు కింద జాకీ సెట్ చేసి పంచర్ అయినా టైర్లు ఊడదీసి మరో టైరును సెట్  చేసుకున్నారు. ఇది చూసిన వారు ఆమెను గుర్తు పట్టారు. మీరు మైసూరు జిల్లా కలెక్టర్ కదా అని అడిగితే ఆమె చక్కగా నవ్వేశారు. అవును నేనే రోహిణి సింధూరి అని చెప్పారు. అంతే అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఏంటి కలెక్టర్ స్వయంగా కారు టైరు మార్చుకుంటున్నారు దేశంలో ఎక్కడైనా చూసారా అనుకుంటూ ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో నే ఇప్పుడు నెట్ లో వైరల్ అయింది. కలెక్టర్ రోహిణి సింధూరి తీరు అందరికి నచ్చుతుంది. పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అవినీతికి పాల్పడే వారు మన దేశంలో లెక్కలేనంతమంది. ఆమె మాత్రం నిజాయితీగా వ్యవహరించారని అంతా మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: