
కానీ ఈ మధ్యన కొన్ని అగ్రిమెంట్ కు సబంధించిన ఇష్యూస్ కారణంగా ఈ క్లబ్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మెస్సీ మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఒకానొక దశలో బాగా ఏడ్చేశాడు. ఇది చూసిన అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే అందరిలాగే మెస్సీ సైతం వస్తున్న కనీళ్లను తుడవడానికి పక్కనే ఉన్న టిష్యూను వాడాడు. ఇలా వాడేసిన టిష్యూ ను పక్కన పడేశాడు. అయితే ఇక్కడే ఎవరూ ఊహించని ఒక అద్భుతం చోటుచేసుకుంది. మెస్సీ ఇలా వాడి పడేసిన టిష్యూను ఒక అభిమాని తీసుకుని ఏకంగా ఆన్లైన్ లోని ఈ కామర్స్ సైట్ ఎమ్‌ఈకెడో వేలం పెట్టాడు.
ఈ టిష్యూ ధరను ఆ వ్యక్తి 1 మిలియన్ డాలర్లుగా నిర్ణయించాడు. అంటే ఇండియా కరెన్సీలో ఇది ఏడున్నర కోట్ల రూపాయలతో సమానం. ఇది అలా అలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అందరూ ఇదేందీ సామీ...ఎందుకు పనికిరాని, వాడేసిన టిష్యూ పేపర్ కు ఏడున్నర కోట్లా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదీ అసలు కథ. ఎప్పుడైనా ఊహించారా టిష్యూ పేపర్ ఇంత ధర పలుకుతుందని, జరగనివి జరగడమే అద్భుతం.