యువరాజ్ సింగ్ సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. తన రియల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచు కొంటూనే ఉంటారు. ఇక ఇటీవల యువరాజ్ సింగ్ ఒక వీడియో పోస్ట్ చేయగా ఈ వీడియో చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. వామ్మో యువరాజ్ సింగ్ ఇంత రిస్క్ చేశాడూ ఏంటి అంటూ అవాక్కవుతున్నారు. ఇటీవలే భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ దుబాయ్ టూర్ వెళ్ళాడు. అక్కడ ఎన్నో రకాల సాహసాలు చేసాడు.
దుబాయ్ లో ఎంతో ఫేమస్ అయిన ఫేమ్ పార్కులో ఒక భారీ కొండచిలువను మెడలో వేసుకున్నాడు యువరాజ్ సింగ్. అయితే ఇలా యువరాజ్ కొండ చిలువను మెడలో వేసుకున్నా సమయంలో అభిమానులు భయపడుతుంటే యువరాజ్ మాత్రం చిరునవ్వు చిందించాడు. ఇక అంతటితో ఆగకుండా ఆ తర్వాత లైగర్ అనే ఒక పెద్దపులితో టగ్ ఆఫ్ వార్ ఆడాడు యువరాజ్ సింగ్. ఏకంగా ఒక తాడును పెద్దపులి ఒక వైపు నుంచి లాగుతుండగా మరో వైపు నుంచి పెద్దపులితో పోటీ పడ్డాడు. ఇక ఆ తర్వాత చింపాంజీ ఎలుగుబంటి జిరాఫీ కి స్వయంగా ఆహారం అందించాడు. ఇవన్నీ తనకు ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చాయని చెబుతూ ఈ టూర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు యువరాజ్ సింగ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి