ఈ మధ్య ఫోటోలు తీయించుకోవాలనే కోరిక చాలా మందికి కలుగుతుంది.పెళ్ళిళ్ళు, పెద్ద ఫంక్షన్ లకు అయితే చెప్పనక్కర్లెదు. అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్లు పోటీ పడి మరీ ఫోటోలను దిగుతున్నారు..ఇలాంటి వాటికి నో కాంప్రమైజ్ అంటున్నారు..అంతా బాగుంది కానీ ఫోటోల కోసం గొడవ పడటం అనేది ఎక్కడైనా చుసారా?.. అది నేను, నేను అంటూ కొట్టుకోవడం ఎప్పుడైనా విన్నారా..ఇప్పుడు అలాంటి ఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది.


జార్ఖాండ్‌ లో మాత్రం ఇందుకు పూర్తిగా రివర్స్‌ జరిగింది. పెళ్లి చూడటానికి వచ్చిన బంధువుల వల్ల భారీ ఫైటింగ్ జరిగింది. అమ్మాయి తరపు బంధువుల దగ్గర మొదలైన రచ్చ.. ఇరువర్గాలు పౌరుషంగా మాట్లాడుకోవడం దగ్గర నుంచి ఇటుకలు ,రాళ్లు, కర్రల తో కొట్టుకునే వరకు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది.. పెళ్లికొడుకు, పెళ్లి కూతురుతో ఫోటో దిగే విషయంలో గొడపడ్డారు. పెళ్లి వేడుకను చూసి వధు వరులను ఆశీర్వదించడానికి జీప్‌లు, తుఫాన్‌ వాహనాల్లో వచ్చిన వాళ్లంతా ఆఫ్ట్రాల్ ఫోటో కోసం తలకాయలు పగిలేలా కొట్టుకున్నారు.

 

ముందు మేం ఫోటో దిగుతామంటే లేదు మేం దిగాల్సిందేనంటూ అమ్మాయి, అబ్బాయి తరపు బంధువులు పోటీ పడ్డారు. అక్కడే వివాదం చోటు చేసుకుంది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.. ఇటుకల నుంచి రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో ఆడవాళ్లు, చిన్న పిల్లలు, వృద్ధులు ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశారు. ప్రశాంతం గా జరగాల్సిన పెళ్లి వేడుక కాస్తా ఫోటోల కారణంగా ఉద్రిక్తత వాతవరణాని కి దారి తీసింది. అక్కడ ఉన్న స్థానికులు అక్కడికి వచ్చి ఇరు వర్గాల వారికి సర్ది చెప్పడంతో అందరు అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసారు. అది కాస్త సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: