సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని రకాల వీడియోలు భయపెడుతూ ఉంటాయి. ఇంకొన్ని రకాల వీడియోలు మాత్రం చూడముచ్చటగా ఉంటు మనసులు పులకరింప చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి వీడియోలు మనుషులకు ప్రకృతికి జంతువులకు ఉన్న సంబంధాలు ఏమిటి అన్న విషయాన్ని చెప్పకనే చెబుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఒక ఏనుగు చూపించిన మంచితనం అందరి మనసులు పులకరింప చేస్తుంది.


 ట్విట్టర్లో ఈ వీడియో చెక్కర్లు కొడుతుంది.. ఈ వీడియో లో ఏముంది అని అంటారా.. సాధారణంగా జంతుప్రదర్శనశాల కి ఎంతో మంది వెళుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక చిన్నారి కుటుంబం కూడా  వెళ్ళింది. అయితే ఏనుగులను చూస్తున్న సమయంలో చిన్నారి షూ పొరపాటున ఏనుగులు ఉన్న ప్లేస్ లో పడిపోయింది. దీంతో  షూ పోయింది ఇక దాని గురించి మర్చి పోవడమే అని అందరూ అనుకున్నారు అందరు. కానీ  ఏనుగు తన తొండంతో చిన్నారి షూ పట్టుకుని మళ్లీ వెనక్కి ఇచ్చేసింది. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఈ వీడియో ప్రతి ఒకరి మనసును తాకుతుంది.


 చైనాలోని శాంగ్ డోంగ్ ప్రావిన్స్  లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని తెలుస్తోంది. అయితే ఇలా షూ తిరిగి ఇచ్చేసినందుకు గాను ఆ ఏనుగుకు  కొంత గడ్డిని ఇచ్చారు ఆ కుటుంబం.  ఇదంతా పక్కనే ఉన్న వారు వీడియో తీసి ఇక ట్విట్టర్ లో అప్లోడ్ చేశారు. దీంతో వైరల్ గా మారింది. ఆ ఏనుగు అలా షూ తిరిగి ఇవ్వడం విస్మయానికి గురి చేసింది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇక ఏనుగు మంచితనానికి గొప్ప మనసుకి అక్కడున్న వారందరూ వావ్ అంటూ అరిచారు. ఇది చూసిననెటిజన్లు ఆ ఏనుగు మంచితనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్నట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ఇక మీరు కూడా ఈ వీడియోకి చూసేయండి మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: