అయితే సాధారణంగా నాగుపాములు వాటికంటే ఎక్కువ పరిమాణం ఉన్న జీవులను కూడా ఎంతో అలవోకగా మింగగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇలా మింగటం అయితే ఎంతో అలవోకగా చేస్తాయి కానీ వాటిని కడుపులో పెట్టుకుని అటూ ఇటూ కదలడానికి మాత్రం ఎంతో ఇబ్బంది పడి పోతూ ఉంటాయి. ఇక ఇలాంటివి ఎన్నో సార్లు నాగుపాముల విషయంలో జరిగింది. ఇప్పుడు కూడా ఇలానే జరిగింది. సాధారణంగా అయితే కొండచిలువ మిగితా పాములను మింగేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక నాగు పాము కొండచిలువను మింగేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఒడిశాలో ఈ ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. అటవీ ప్రాంతానికి సమీప గ్రామంలో ఒక ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించింది. అదే సమయంలో ఒక పెద్ద నాగుపాము కూడా అక్కడికి వచ్చింది. దీంతో రెండు పాములు పోట్లాడుకున్నాయి. ఈ క్రమంలోనే కొండచిలువను నాగుపాము అమాంతం మింగేసింది. ఇది చూసిన స్థానికులు అవాక్కయ్యారు. చూస్తుండగానే కొండచిలువ మింగేసిన నాగుపాము ఆ తర్వాత బయటకు కక్కేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి