ఇటీవలి కాలంలో ఎంతోమంది యువకులు సినిమాల్లో చూసి తాము కూడా హీరోలం అంటూ భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అచ్చం సినిమాల్లో లాగానే గొడవలకు దిగుతూ చివరికి చావు దెబ్బలు తింటూ ఉన్నారూ అన్న విషయం తెలిసిందే. ఇలాంటిదే చేసాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఏదో కారణం చేత ఒక వ్యక్తి తో గొడవ పడుతూ కనిపిస్తున్నాడు. అయితే అతనికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఈ క్రమంలో తన ఎదురుగా ఉన్న వ్యక్తిని ఎలాగైనా చితక్కొట్టుడు కొట్టాలి అని భావించాడు.
కోపంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియక ఏకంగా పక్కనే ఉన్న కారు ని తన తలతో గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత తన ముందు ఉన్న వ్యక్తి ని కొట్టడానికి వెళుతున్న సమయంలో ముందు ఉన్న వ్యక్తి ఒక పంచ్ ఇచ్చాడు. అంతే అతను ఒక్కసారిగా నేలమీద కుప్పకూలిపోయాడు. ఇక ఒక్క పంచు తో అతను మళ్లీ పైకి కూడా లేవ లేదు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఎదుటివారి పట్ల అహంకార ధోరణి తో వ్యవహరిస్తే ఇలాంటి శాస్తే జరుగుతుంది అంటూ ఎంతో మంది ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి