ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. అయితే మనుషుల తర్వాత కాస్త తెలివైన జంతువులుగా మాత్రం కొన్ని మాత్రమే గుర్తింపు సంపాదించుకున్నాయి. అలాంటి వాటిలో కోతులు ముందు వరసలో ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే మనుషులు కోతుల నుంచే వచ్చారు అని చెబుతూ ఉంటారు. అందుకే మనుషులకు ఉన్నట్లుగానే అటు కోతులకు కూడా కాస్త అతి తెలివితేటలు ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోతులకు ఉన్న తెలివితేటలను అవి ఎంతో చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆహారాన్ని సంపాదించుకోవడం విషయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 అంతేకాదు మనుషులకు కోతులకు మధ్య దగ్గర సంబంధం ఉన్నందుకో ఏమో కోతులు ఎప్పుడూ మనుషులకు కాస్త దగ్గరగానే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు మొబైల్ ఫోన్లు కళ్ళజోళ్ళు ఇతర వస్తువులను లాక్కెళ్ళడం లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు కోతులు చేసే పనులు కాస్త ఫన్నీగా అనిపించినప్పటికీ మరికొన్నిసార్లు మాత్రం భయాన్ని కలిగిస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 అయితే ఏకంగా కొన్ని కొన్ని సార్లు కోతులు మనుషులపై దాడి చేయడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించి. ఒక అందమైన అమ్మాయి బ్రిడ్జి పైన నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలోని ఏదో విషయంలో కోపం లో ఉన్న కోతి మహిళపై దాడి చేస్తుంది. జుట్టు పట్టుకుని గట్టిగా లాగుతుంది. హెయిర్ క్లిప్ తో సహా జుట్టు మొత్తం పట్టుకొని కిందకి లాగుతుంది. అయితే ఆమె ఎంత విడిపించుకునేందుకు ప్రయత్నించిన కోతి మాత్రం వదలదు. చివరికి అమ్మాయి గట్టిగా అరవడంతో పక్కనే ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుని రావడంతో కోతి అక్కడ నుంచి పారిపోతుంది. కోతి దాడి చేసిన విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: