నేటి రోజుల్లో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా ప్రతిరోజు తెలుసుకోగలుగుతున్నారు నేటిజన్స్. అంతేకాదు ప్రపంచంలో నలమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా నిమిషాల వ్యవధిలో అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో ప్రత్యక్షమవుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే ఇంటర్నెట్ ను ఎప్పుడు షేక్ చేస్తూ ఉంటాయి. ఇక ఇలా సోషల్ మీడియాలోకి వచ్చిన కొన్ని వీడియోలు నేటిజన్స్ ని తెగ నవ్విస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.


 చింపాంజీ చేసిన పని కాస్త ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తుంది అని చెప్పాలి. సాధారణంగా తల్లిదండ్రులు చిన్నతనం నుంచే పిల్లలకు మంచి నడవడిక నేర్పించాలని అనుకుంటూ ఉంటారు. అయినప్పటికీ తల్లిదండ్రుల మాటలు వినని పిల్లలు కొన్ని కొన్ని సార్లు అల్లరి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా పిల్లలు చెప్పిన వినకుండా అల్లరి చేస్తుంటే ఏకంగా తల్లి వీపు విమానం మోత మోగించి కొట్టి మరి నేర్పిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చింపాంజీ కూడా ఇలాంటిదే చేసింది. సాధారణంగానే చింపాంజీలు మనుషుల జీవనశైలికి దగ్గరగానే అని పనులు చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత అచ్చం రియల్ లైఫ్ లో పేరెంట్స్ లాగానే ఆ చింపాంజీ కూడా స్పందించింది. అల్లరి చేస్తున్న పిల్ల చింపాంజీకి బడిత పూజ చేసింది ఆ తల్లి చింపాంజీ. జూలో చింపాంజీలను చూసేందుకు సందర్శకులు వచ్చారు. అయితే వారిపై పిల్ల చింపాంజీ రాళ్లు విసురుతూ ఉంది. ఇది చూసిన తల్లికి కోపం వచ్చింది. ఇంకేముంది ఒక కర్ర చేతిలో పట్టుకొని ఆ పిల్ల చింపాంజీకి బడిత పూజ చేసింది. దీంతో అక్కడున్న పర్యటకులందరూ కూడా ఆశ్చర్యపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: