
ఇలా వర్షాకాలం ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో అనుభవాలను మిగులుస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ఎక్కడికక్కడ వరదల ప్రభావం పెరిగిపోతుంది. ఈ వరదల కారణంగా ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయి ఇక జనజీవనం మొత్తం దెబ్బతింటున్న పరిస్థితి కనిపించింది అని చెప్పాలి. అయితే వర్షం ఇలా ఎంతో మంది జనాలను వరదల కారణంగా ఇబ్బంది పెట్టడమే కాదు అటు ప్రేమికులకు ఒక మధురానుబూతులను కూడా మిగులుస్తుంది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఒక వీడియో నిలుస్తూ ఉంది అని చెప్పాలి.
సాధారణంగా వర్షాకాలం అటు ప్రేమికులకు అనుకూలమని కవులు చెబుతూ ఉంటారు. అయితే ఇది నిజమే అన్న విషయాన్ని ఇక్కడ ఓ జంట నిరూపించింది. భోపాల్ లో ఒకవైపు జోరుణ వర్షం పడుతుండగా.. ప్రధాన రహదారి మీద ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు. ఒకవైపు వాహనాలు రోడ్డుపై దూసుకుపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇక ఈ ప్రపంచాన్ని మరిచిపోయిన ఓ ప్రేమ జంట తన్మయత్వంతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడిరోడ్డుపై డాన్స్ చేశారు. అయితే ఇదంతా వీడియో తీసిన ఒక నేటిజన్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.