ప్రపంచ రికార్డుల్లో  తమ పేరును చూసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. కానీ వరల్డ్ రికార్డు సాధించడం అనేది అంత సులభమైన విషయమేమీ కాదు. ఒకే విషయంపై ఏళ్ల తరబడి సాధన చేసిన తర్వాత ఇలాంటి వరల్డ్ రికార్డు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు రోజూ చేసే పనులనే కాస్త కొత్తగా ట్రై చేస్తే చాలు ఇక ప్రపంచ రికార్డు మన పేరిట లికించబడుతుంది అన్నది నేటి రోజుల్లో ట్రెండ్. ఇక ఇలాంటివి చేసే ఎంతోమంది సరికొత్తగా వరల్డ్ రికార్డులు సాధిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 రోజు చేసే పనులనే కొత్తగా ట్రై చేసి ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నారు. ఇవి చూసిన తర్వాత ఇలా చేసినా కూడా ప్రపంచ రికార్డు సాధించవచ్చా ఇన్నాళ్లు ఇలాంటి ఆలోచన మాకు రాలేదే అని నెటిజన్స్ అనుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఇలాగే వరల్డ్ రికార్డు సాధించాడు. ఏకంగా మిరపకాయలు నమిలి ప్రపంచ రికార్డు సృష్టించాడు. సాధారణంగా పొరపాటున అన్నంలో ఒక మిరపకాయ నమిలితేనే మంటకి ఎగిరి గంతులు వేస్తాం. అలాంటిది కెనడాలోని ఒక యువకుడు మాత్రం ఒకటి కాదు రెండు కాదు 50 వేడి మిరపకాయలను నమిలి మింగేశాడు.


 అది కూడా ఆరు నిమిషాల 49.2. సెకండ్లలో ఇంకో విషయం ఏమిటంటే అతను తిన్నవి అల్లాటప్ప మిరపకాయలు కాదు ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలు. మైక్ జాన్ అనే వ్యక్తి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు వరల్డ్ రికార్డు సాధించాడు. ఆరు నిమిషాల 49.2 సెకండ్లలో అత్యంత ఘాటైన 50 వేడి మిరపకాయల ముక్కలను కొరికి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే వరల్డ్ రికార్డ్ సాధించాక అతనికి ఏమనిపించిందో తెలియదు.. కానీ మరో 80 మిరపకాయలను కూడా నమిలాడు. అంటే మొత్తం 135 మిరపకాయలను నమిలి అద్వితీయమైన రికార్డును సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: