83 ఏళ్ల బామ్మ రుచికరమైన వంటలు చేస్తూ తెగ వైరల్ అవుతుంది. ఈవిడ వంటల రుచి ముందు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ వంటకాలు కూడా వేస్ట్. పూర్తి వివరాల్లోకి వెళితే..కోరుట్ల పట్టణానికి చెందిన పాతర్ల నర్సమ్మ గారు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మనసుకు నచ్చిన పని చేయడానికి వయసు అడ్డు కాదని నిరూపిస్తున్నారు.లేటు వయస్సులో కూడా హాటు వంటలతో అదరగొడుతూ.. అందరికీ వంటల చేయడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు.తన పాకశాస్త్ర ప్రావీణ్యానికి ఆధునికతను జోడిస్తూ యూట్యూబ్‌లో అదరగొడుతున్నారు.తనకు 83 ఏళ్లు వచ్చినా కానీ నర్సమ్మ చేస్తున్న అద్భుతాలను చూసి ప్రేక్షకులను ఔరా అనిపిస్తున్నాయి. యువతకు ధీటుగా యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ, తనలో ఉన్న నైపుణ్యాన్ని పది మందికి పంచుతున్నారు. వయస్సులో ఉండి కాలాన్ని వృథా చేస్తున్న ఎందరో యువత ఈ వృద్ధురాలు చేస్తున్న పని చూసి ప్రేరణ పొందాల్సిన అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంది.


తనకు ఇష్టమైన పనిని ఇంతలా ప్రేమిస్తూ ఈ వయస్సులో కూడా తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న నర్సమ్మ గారి ప్రయత్నానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.తనకున్న అద్భుతమైన టాలెంట్ తో తన వారి సహకారంతో ఆధునికతను జోడించి నర్సమ్మ అద్భుతం చేస్తున్నారు. తమ మామిడితోటలో కూర్చుని చేసే వంటలను చక్కగా రికార్డ్ చేస్తూ విలేజ్‌ దాది పేరుతో ఓపెన్ చేసిన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. తన ఛానెల్ ద్వారా భావి తరానికి నాటి వంటకాల గొప్పతనాన్ని ఇంకా తయారీ పద్ధతులను వివరిస్తూ ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.పాతర్ల నర్సమ్మ ప్రతి వారం షో షూట్ చేస్తున్నారు.తన యూట్యూబ్ ఛానెల్ కోసం వారానికో రోజు ఒక్కో వంటతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మామిడి తోటలో కూర్చుని మజా మజా వంటకాలను వండుతూ అందరికీ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నో రచికరమైన వంటకాలను మరింత రుచికరం చేసే చిట్కాలను వివరిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: