సాధారణంగా విదేశీ టూరిస్టులు మన దేశంలోని చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడానికి లేదంటే టూరిస్ట్ ప్లేస్లను చూడటానికి వస్తూ ఉంటారు. అయితే ఇలా వచ్చినప్పుడు విదేశీ టూరిస్టులకు ఏర్పడే మొదటి సమస్య కమ్యూనికేషన్. విదేశీయులకు ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. కానీ మన దేశంలో చాలామంది అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడలేరు అన్న విషయం తెలిసిందే. దీంతో పూర్తి స్థాయిలో ఇక విదేశీ టూరిస్టులకు ఆయా ప్రాంతాల గురించి వివరించడం చేయలేకపోతు ఉంటారు. అయితే పెద్ద పెద్ద చదువులు చదివిన వారు సైతం అనర్గంగా ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇబ్బంది పడటం కూడా ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ మాత్రం మాట్లాడిన ఇంగ్లీష్ ప్రతి ఒక్కరిని కూడా ఫిదా చేసేస్తూ ఉంది. ఏకంగా విదేశీ టూరిస్ట్ కు ఎక్కడ తక్కువ కాదు అనే రీతిలో ఆటో డ్రైవర్ ఇంగ్లీష్ లో ఇరగదీసేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా సదరు ఆటో డ్రైవర్ మాట్లాడిన ఇంగ్లీష్ చూసి యూకే కి చెందిన టూరిస్ట్ సైతం ఫిదా అయిపోయాడు. బ్రిటిష్ టూరిస్ట్ అయిన బాగ్లర్ జాకి ఇటీవల కేరళ పర్యటనకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడ ఒక హోటల్లో స్టే చేశాడు. అయితే ఆ హోటల్ని ఖాళీ చేసే సమయంలో సడన్గా అతని ఏటీఎం వర్క్ చేయడం మానేసింది. దీంతో హోటల్ నుంచి బయటికి వచ్చిన సదరు వ్యక్తి ప్రధాన రహదారి గుండా ఏటీఎం సెంటర్ ఎక్కడ ఉందా అని వెతకడం మొదలు పెట్టాడు. అయితే ఇంతలోనే అక్కడ ఉన్న ఒక ఆటో డ్రైవర్ ఏంటి సార్ అంటూ ఆంగ్లంలో పలకరించాడు. అయితే అతనితో ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియక సదరు టూరిస్ట్ కాస్త పొడిపొడిగానే మాట్లాడాడు. కానీ ఆ తర్వాత ఆటో డ్రైవర్ అనర్గంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోని అతను సమస్యను పరిష్కరిస్తాడు అన్న ధైర్యం ఆ టూరిస్ట్ కి  ఏర్పడింది. దీంతో అతని సహాయంతో ఏటీఎం ఎక్కడుందో తెలుసుకున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: