అడవిలో రారాజుగా ఉంటుంది సింహం. ఆకలేసింది అంటే కళ్ళ ముందు కనిపించిన జంతువును చంపి ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే అడవికి రారాజు అయిన సింహంతో ప్రతి జంతువుకు కూడా శత్రుత్వమే ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకవేళ సింహాన్ని చంపే ఛాన్స్ వస్తే ఏ జంతువు అయినా సరే వదులుకోవడానికి అస్సలు ఇష్టపడదు. అందుకే కొన్ని కొన్ని సార్లు ఏకంగా అడవి దున్నలు గుంపులుగా వచ్చి సింహాలపై దాడి చేసి ప్రాణాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయ్. అయితే ఇలా సింహాలపై రివేంజ్ తీర్చుకునే ఛాన్స్ వస్తే వాడుకునే జంతువులలో హైనాలు, బబూన్ కోతులు ముందుంటాయి అని చెప్పాలి.


 అయితే భారీ ఆకారం ఉన్న సింహాలపై రివేంజ్ తీర్చుకోవడంలో భయపడిపోయే బాబున్ కోతులు ఇక సింహం పిల్లలు ఎక్కడైనా కనిపించాయి అంటే చాలు రెచ్చిపోతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా సింహం పిల్ల ఒంటరిగా ఉండడం గమనించిన ఒక బబున్ కోతి ఏకంగా దానిని ఎత్తుకెళ్లి సాహసం చేసింది. ఇది సింహం గమనించింది. ఆ బబున్ కోతిని భయపెట్టేందుకు ప్రయత్నించిన ఆ కోతి మాత్రం ఏకంగా సింహం పిల్లను చేతిలో పట్టుకుని చెట్టుపై అటు ఇటు తిరగడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఏకంగా తన పిల్లల విషయంలో బబూన్ కోతి వ్యవహరించిన తీరుతో సింహానికి చిరురెత్తుకొచ్చింది. దీంతో ఊహించని రీతిలో రివేంజ్ తీర్చుకుంది. ఏకంగా బబున్ కోతికి నరకం చూపించింది. ఏకంగా  కోతిని వేటాడటం మొదలుపెట్టిన సింహం ఒక్కసారిగా పంజా విసిరి ప్రాణాలు తీయలేదు. ఏకంగా నరకం చూపించింది. ఒకవైపు కొరుకుతూ మరోవైపు రక్కుతూ నానా హింస పెట్టింది. అయితే ఆ సింహం నుంచి తప్పించుకునేందుకు బబున్ కోతి ఎంతలా ప్రయత్నించినా.. చివరికి ఉపయోగం లేకుండా పోయింది అని చెప్పాలి  అత్యంత దారుణంగా రివేంజ్ తీర్చుకున్న సింహం.. ఇక ఆ బబూన్ కోతిని చివరి ప్రాణాలు తీసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: