ఇక ఈ మధ్యకాలంలో అయితే కుక్కలకి మనుషులకి మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది అన్న విషయం తెలిసిందే. కొంతమంది ట్రెండ్ ఫాలో అవ్వడం కోసం ఇక నచ్చిన బ్రీడ్ కు సంబంధించిన కుక్కను తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటే.. ఇంకొంతమంది ప్రేమతోనే ఇలా కుక్కను పెంచుకుంటున్నారు. ఏకంగా మనుషుల మీద చూపించిన ప్రేమ కంటే ఇలా పెంపుడు కుక్కల పైన ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే వారు పస్తులు ఉండడానికైనా సిద్ధంగా ఉంటారు కానీ కుక్కలకు మాత్రం మంచి ఆహారం పెట్టడం కూడా నేటి రోజుల్లో కనిపిస్తోంది.
అదే సమయంలో పెంపుడు కుక్కలు కూడా యజమానుల పట్ల ఎంత విశ్వాసం విధేయత కలిగి ఉంటున్నాయి అన్నదానికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు అనే విషయాన్ని గుర్తు చేసే వీడియో ఒకటి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ వ్యక్తికి అనారోగ్యంగా ఉండడంతో అంబులెన్స్ లో ఆసుపత్రిలో తరలిస్తున్నారు. అయితే యజమానిని విడిచి ఉండలేకపోయినా పెంపుడు కుక్క.. ఆ వాహనం వెనకే చాలా దూరం పరిగెత్తింది. దీంతో అంబులెన్స్ ఆపిన సిబ్బంది దానిని అంబులెన్స్ లోకి ఎక్కించుకున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ఇంటర్నెట్లో మాత్రం తెగ వైరల్ గా మారింది.