19 వాహనాలు తప్పించుకున్న బైక్ – కానీ బస్సు మాత్రం… ఈ ప్రమాదంలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం - బైకర్ ప్రమాదానికి గురైన తర్వాత దాదాపు 19 వాహనాలు అదే మార్గంలో వెళ్లాయి. ఆ డ్రైవర్లు రోడ్డుపై పడిపోయిన బైక్‌ను గమనించి చాకచక్యంగా తప్పించుకున్నారు. కానీ బస్సు డ్రైవర్ మాత్రం దానిని గమనించలేకపోయాడు. ప్రశ్న ఇదే — ఇంత పెద్ద వాహనం నడుపుతూ డ్రైవర్ ఎందుకు జాగ్రత్త వహించలేకపోయాడు? అతను అలసటలో ఉన్నాడా? లేక మొబైల్‌లో ఏదైనా దృష్టి మళ్లిందా? అనే అంశాలపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది .. పోలీసులు ఇప్పటికే ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించారు. బైక్ ప్రమాదం జరిగిన సమయం, బస్సు వచ్చిన సమయం, మధ్యలో వెళ్లిన వాహనాల రికార్డులు అన్నీ పరిశీలిస్తున్నారు. స్థానికులు కన్నీటి పర్యంతమై - “ఎవరైనా ఆ బైక్‌ను రోడ్డు పక్కకు జరిపి ఉంటే, 19 నిరపరాధుల ప్రాణాలు కాపాడేవి” అని వాపోతున్నారు.
తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబాలు .. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలా మంది కుటుంబాలు ఒకే ప్రాంతానికి చెందినవారే. ఒక్కసారిగా ఇంతమంది మృతులు కావడంతో కర్నూలు జిల్లా అంతటా దుఃఖ వాతావరణం నెలకొంది. అంతే కాదు, ఈ సంఘటన రాత్రివేళ రోడ్డు భద్రత, అతివేగం ప్రమాదాలపై, అలాగే ప్రమాద సమయంలో మానవత్వంతో స్పందించాల్సిన అవసరం పై మరోసారి ఆలోచింపజేస్తోంది. ఒక బైక్ రోడ్డుమధ్యలో పడిపోవడం - 19 ప్రాణాల బలి! ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, మన సమాజం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చెప్పే చేదు వాస్తవం. రాత్రివేళ జాగ్రత్తగా డ్రైవ్ చేయడం, ప్రమాదం జరిగితే వెంటనే స్పందించడం — ప్రాణాలను కాపాడే గొప్ప మానవత్వం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి