జీవితంలో ప్రతి ఒక్కరికీ సుఖాలు, బాధలు, కష్టాలు సహజంగా వస్తుంటాయి. కానీ మనకు కలిగిన ఎటువంటి బాధ అయినా కానీ, ఆ బాధను ఒక చిన్న సమస్యగా చూస్తే కనుక అది మనపై పెద్ద ప్రభావం చూపించదు. ఒక వేళ అదే సమస్యను పెద్దదిగా ఊహించుకుంటే అది మనకు తీరని బాధగా ఉంటుంది. మనపై తీర్వ ప్రభావాన్ని చూపిస్తుంది. మన రోజువారీ జీవితంలో తీరని నష్టాన్ని మిగులుస్తుంది.