మారుతున్న కాలంతో పాటు ప్రజల్లోనూ ఎంతో మార్పు వచ్చింది. ఒకప్పటి జనరేషన్ కి ఇప్పటి జనరేషన్ కి ఎన్నెన్ని మార్పులు జరిగాయో అందరికీ తెలిసిందే. అన్నీ కూడా మన కళ్లముందు కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రేమ విషయానికొస్తే అప్పట్లో ప్రేమ అనే పదం గురించి మాట్లాడితే కూడా అందరూ పెద్ద తప్పులా పరిగణించే వారు. కానీ ఇప్పట్లో సగానికి కంటే ఎక్కువ మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఒక వయసు వచ్చిందంటే చాలు ప్రేమలో పడిపోతున్నారు. మరి కొందరైతే ఆకర్షణను కూడా ప్రేమ అనుకుని ఆరాటపడుతున్నారు. అయితే ప్రేమలో అందరూ గెలుస్తారని చెప్పలేము.

ప్రేమలో ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకునే వారు, వాటి గురించే ఆలోచిస్తూ తమ కెరీర్ ని నాశనం చేసుకునే వారు ఇలా చాలా మందే ఉంటారు. అలాంటి వార్తలను తరచూ మనము టీవీలోనూ పేపర్ లోనూ చూస్తూనే ఉంటాము. వీటన్నిటి వలన నష్టం ఎవరికో కాదు స్వయంగా వారికి, వారి కుటుంబాలకు మరియు వారి సన్నిహితులకే, ఈ విషయం తెలిసి కూడా క్షణికావేశంలో కొందరు , ముందు చూపు లేక మరి కొందరు పొరపాట్లు చేసి తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుని మంచి భవిష్యత్తుతో సంతోషంగా జీవించాల్సిన వారెందరో ఇలా అర్ధాంతరంగా వారి ఫ్యుచర్ ని పణంగా పెడుతున్నారు. చదువుపై అశ్రద్ద చూపడం, ఉద్యోగంలో మంచి అవకాశాలను వదులుకోవడం, మానసికంగా కుంగిపోవడం వంటివి మనం అందుకోవల్సిన విజయాలను అంటే మన భవిష్యత్తును సర్వ నాశనం చేసేస్తాయి.


ప్రేమ తప్పు అనడం లేదు. కానీ టీనేజ్ లో పరిపక్వత లేని సమయంలో ప్రేమలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని పెద్దల అభిప్రాయం. ఏ వయసులో అయినా ప్రేమ విఫలం అయింది అంటే దానర్థం మీ జీవితం ఇక శూన్యమని కాదు, ఇంకా భవిష్యత్తు చాలానే ఉంది. సాధించాల్సింది ఇంకెంతో మిగిలే ఉంది. అలాంటప్పుడు చేతులారా మన బంగారు భవిష్యత్తును మనమే నాశనం చేసుకోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: