సంతోషం లేని చోట విజయం ఎలా ఉంటుంది. అవును ఇది నిజమే సంతోషం, సంతృప్తి లేని చోట విజయం దక్కడం కష్టమే. మనిషి సంతోషంగా, సాదరంగా అన్నిటినీ ఆహ్వానించ గలిగితేనే కోరుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోగలడు. మనం ఒంటరిగా జీవించడం లేదు, నలుగురితో పాటు ఈ సమాజంలో జీవిస్తున్నాం. మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో నిరాశ, అసంతృప్తి, బెరుకుతనం ఉన్న వ్యక్తులు ఎందరో కనిపిస్తూ ఉంటారు. వారు చేసే పనుల్లో కూడా అవి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది ఎక్కువగా తమ బాధలను భరించలేక వాటిని వ్యక్తం చేస్తూ ఉంటారు. నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నాను అంటూ.. సమస్యలతో నలిగిపోతున్నాను అని చెబుతూ ఉంటారు.

ప్రతి చిన్న దానికి బాధపడుతూ, భయపడుతూ ఉంటారు. అస్సలు కాస్త సమయం కూడా సంతోషంగా ఉండలేరు . అయితే ఇలాంటి వారు లక్ష్యాన్ని చేరుకోవడం లేదా విజయాన్ని అందుకోవడంలో ఎక్కువగా విఫలం అవుతారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వారు ఇలా వారి బాధల గురించి మరియు కష్టాల గురించి పదే పదే ఆలోచిస్తూ చెబుతూ నిజంగానే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. వాటిని ఎలా ఎదుర్కోవాలి?ఏ రకంగా అధిగమించాలి? ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అన్ని విషయాలను ఆలోచించలేరు.

కాబట్టి ఇలాంటి వైఖరి ఉన్న వారు ముందుగా మిమ్మల్ని మీరు దృఢంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. అప్పటికి కూడా కష్టం అనిపిస్తే గొప్పవారని అనగా వినాయవంతులు అయిన వారిని చూసి స్ఫూర్తిని పొందండి. అన్ని మనకు అనుకూలంగా ఉండవు, మనమే మనకు తగిన విధంగా మార్చుకోవాలి. అన్నిటికన్నా ముందు కష్టాలలో కూరుకుపోతున్నా చిరునవ్వుతో సంతోషంగా ఉండాలి అని చెప్పడం లేదు. కానీ ఆ బాధ లోనే మునిగి పోకండి. సంతోషంగా ఉండటానికి కావలసిన వాతావరణాన్ని మీరే ఏర్పాటు చేసుకోవాలి అన్న విషయాన్ని గ్రహించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: