అనపగింజలు: 2 కప్పులు ధనియాలు: 1 టేబుల్ స్పూన్  బ్లాక్ పెప్పర్: 1/4 టేబుల్ స్పూను  ఎండుకొబ్బరిపొడి: 2 టేబుల్ స్పూన్ జీలకర్ర: 1/4 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి: 6  అల్లం: చిన్న ముక్క  వెల్లులి రెబ్బలు: 8-10  గసగసాలు: 1 టేబుల్ స్పూన్ యాలకులు: 1-2  లవంగాలు: 3 - 4  టమోటో: 2(కట్ చేసుకోవాలి)  ఉల్లిపాయ: 2పెద్దవి(తరిగిపెట్టుకోవాలి) చింతపండుగుజ్జు: 1టేబుల్ స్పూన్ బెల్లం: చిన్న ముక్క పసుపు: ¼ టీ స్పన్ ఉప్పు: రుచికి సరిపడా  తయారు చేయు విధానం: ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్ళు పోసి అందులో అనపగింజలను ఒక ఐదు నిముషాల పాటు వేయాలి. . తర్వాత వీటికి ప్లేట్లోకి వేసుకొని పైపొట్టును తీసివేయాలి. (వీటిని పితికిపప్పు అంటారు). వీటిని కుక్కర్ లో పేసి ఒక విజిల్ వచ్చేంతవరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో ధనియాలు, జీలకర్ర, బ్లాక్ పెప్పర్, గసగసాలు, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొన్న పదార్థాలన్నింటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా చింతపండు గుజ్జు, ఉల్లిపాయలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత అందులో ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేసి మరో 5నిముషాలు వేయించి అందులోనే టమోటో ముక్కలు కూడా వేసి వేయించాలి.  తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసి, కుక్కర్ లో ఉడికించి పెట్టుకొన్నా పితికిపప్పును కూడా వేసి మసాలా మిశ్రమంతో బాగా మిక్స్ చేసి తర్వాత 5నిముషాలు మీడియం మంటమీద ఉడికించుకోవాలి. అందులోనే అవసరమైతేనే బెల్లం కొద్దిగా కలుపుకోవచ్చు. అంతే పితికిపప్పు కుర్మా రెడీ. ఇది రైస్, రోటీ, చపాతీ, పూరి, దోశ, ఇడ్లీ మంచి కాంబినేషన్.  

మరింత సమాచారం తెలుసుకోండి: