ఎన్నికల్లో ఓట్ల కోసం ఇప్పుడు పార్టీలు ఇచ్చే వాగ్దానాలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ మహిళలపై వాగ్దానాల వర్షం కురిపించింది. కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు స్తారట. పాఠశాల పిల్లలకు సైకిల్స్‌ పంపిణీ చేస్తారట.

 

బీజేపీ విడుదల చేసిన మానిఫెస్టోలో ఈ హామీలు హైలెట్ గా నిలుస్తున్నాయి. అంతేనా.. పిల్లల పెళ్లిళ్ల కోసం ఆర్థిక సాయం అందిస్తారట. ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం చేస్తారట. ఇవి కాకుండా ఇంకా.. ఢిల్లీ-యమునా వికాస్ బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ చెబుతోంది.

 

20 సూత్రాల పథకంలో నిర్మించిన ఇళ్లకు రిజిస్ట్రేషన్, స్టార్టప్ లకు పోత్సాహంతో పాటు ఫిట్ ఇండియా-ఫిట్ ఢిల్లీ పథకం అమలు.. అక్రమ నివాసాలుగా ఉన్న 1728 కాలనీలోని ప్రజలకు ఉచిత ఇళ్ల పట్టాలు..ఇలా బీజేపీ హామీల వర్షం కురిపించింది.

 

ఇవి కాకుండా ఇంకా.. పేదలకు కేవలం రెండు రూపాయాలకే కేజీ గోదుమ పిండి, డిల్లీలో కొత్తగా 200 కాలేజీలు ఏర్పాటు, పది లక్షల మందికి ఉపాధి ఎస్సీ, ఎస్టీ బీసీ, అగ్రవర్ణ పేదల కోసం వేర్వరుగా అభివృద్ధి బోర్డులు.. ఇలా పలు హామీలు కురిపించింది బీజేపీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: