టాలీవుడ్ లో మహేష్ బాబు  కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మహేష్ బాబు చిన్న వయసు లోనే స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగారు. ప్రతీ నిమిషం కూడా అతని జీవితాన్ని శాసించిన వ్యక్తి తన తండ్రే కాకుండా తన తల్లి కూడా ఉన్నారట. మహేష్ బాబు చిన్న వయసు లోనే తల్లి తండ్రి విడిపోయారు. కృష్ణ విజయ నిర్మలకు బాగా దగ్గరయ్యారు. ఆ సమయంలో మహేష్ బాబు తన తల్లి వద్ద ఎక్కువగా ఉండే వారట. ఆమె ఎక్కువగా మీడియా లో కనపడిన సందర్భం ఏదీ లేదు. అయితే తన తల్లి ప్రోత్సాహం తోనే మహేష్ నేడు ఇలా ఉన్నాడు అని అంటారు. 

 

తల్లిని మహేష్ బాబు ఏ నిమిషం కూడా దూరం పెట్టే వారు కాదని తండ్రి వద్ద ఎక్కువగా ఉన్నా సరే తల్లి తో మాత్ర౦ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండే వాడు అని చెప్తారు. మహేష్ బాబు తన సినీ జీవితంలో తల్లి సలహాలను ఎక్కువగా తీసుకున్నాడు అని అంటారు. కృష్ణ సలహాలు ఇచ్చినా సరే తండ్రికి చెప్పకుండా అతను సినిమాలు చేసిన సందర్భం ఏదీ లేదని అంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు. తల్లి సహకారం గురించి అతను చాలా మంది వద్ద ప్రస్తావించారట. తన తల్లి తనకు ఏ విధంగా హెల్ప్ అయ్యారు అనేది చెప్తారట మహేష్ బాబు. 

 

పోకిరి సినిమా సమయంలో తన కొడుకు పుట్టాడు. ఆ తర్వాత తల్లి సహకారం తోనే ఆ సినిమాను పూర్తి చేసాడట. తన భార్య అప్పుడు ఒంటరి గా ఉండేది అని, విదేశాల్లో షూటింగ్ కి వెళ్ళిన సమయంలో తన భార్యకు ఆమెనే అండగా ఉండే వారు అని మహేష్ తన అత్యంత సన్నిహిత వ్యక్తి వద్ద చెప్పుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: