పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అప్పుడే పిల్లలు ఎందుకు...  కొన్నాళ్లు లైఫ్ ఎంజాయ్ చేద్దాం అని అబిప్రాయపడే  ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు.  కొద్ది రోజులు జీవిత భాగస్వామితో ఆనందాల్ని, స్వేచ్ఛను తనివితీరా అనుభవించిన తర్వాతే పిల్లల సంగతి ఆలోచిస్తాం అంటున్నారు నేటి తరం అమ్మాయిలు. అంతేకాదు వారాల తరబడి ఎటువెళ్లడానికైనా స్వేచ్ఛ ఉండే జీవితం తమకు కావాలని.. అదే పిల్లలుంటే ఇవి సాధ్యం కావని చెప్తున్నారు. కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసి లైఫ్ లో సెటిల్ అయ్యాక పిల్లల్ని గూర్చి ఆలోచిస్తున్నారు.. కానీ ఈ ధోరణి మంచిది కాదంటున్నారు నిపుణులు.
 

 

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటుంటారు మన పెద్దలు కానీ వయసు మొత్తం అయిపోయిన తర్వాత పిల్లలు కావాలంటే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందంటున్నారు. సాధారణంగా మహిళలు రజస్వల అయినప్పటి నుంచి ప్రతి నెల వారిలో అండాల ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది. 37 ఏళ్లు వచ్చేసరికి అండాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. మరోవైపు మగవారిలో కూడా వయసు పెరిగే కొద్ది వీర్యంలో నాణ్యత తగ్గడం.. వీర్య కణాల కదలిక మందగించడం జరుగుతుంది.అందులోను పిల్లలు వద్దనుకుని గర్భ నిరోధక మాత్రలు వాడటం, లూప్ లాంటివి వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. 

 

 40 ఏళ్ల తరువాత పిల్లల కోసం ప్రయత్నిస్తే.. అప్పడు పుట్టే పిల్లలు శారీరకంగా, మానసికంగా లోపాలతో పుడతారని వైద్యులు చెబుతున్నారు. అలా పుట్టిన పిల్లల్లో బుద్ధి మాంద్యం, ఎదుగుదల లోపం తదితర సమస్యలు వస్తాయట. కాబట్టి దంపతులు లేటు వయసులో పిల్లలను కనటం మంచిది కాదని చెబుతున్నారు. మహిళలు 21 నుంచి 29 ఏళ్లలోపు, పురుషులు 40 ఏళ్లు వచ్చేలోపు పిల్లల కోసం ప్రయత్నించడం సర్వత్రా శ్రేయస్కరం అని అభిప్రాయపడుతున్నారు. అందులోను ఇప్పటి జీవన శైలి మారుతుంది అందువల్ల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి.. ఫలితంగా 100 లో 90% ఆడవాళ్లు గర్భాశయంలో నీటి బుడగలు, థైరాయిడ్ సమస్యలు ఎదుర్కుంటారు. ఫలితంగా ఇప్పుడు పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది.. అందుకే భార్య భర్త ఇద్దరు ఆలోచించుకుని మంచిది నిర్ణయం తీసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: