చాలామంది మహిళలు ఇప్పుడు ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో సంతానలేమి ఒకటి.. పెళ్లి అయిన ప్రతి స్త్రీ పిల్లల కోసం ఎంతగానో తాపత్రయ పడుతుంది. ఒక బిడ్డకు జన్మ ఇవ్వాలని, ఆ బిడ్డ తో అమ్మ అని పిలిపించుకోవాలని ఆశ పడుతుంది. కానీ పెళ్లి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిన గాని పిల్లలు పుట్టని దంపతులు ఎంతో మంది ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని తిరగని చోటు ఉండదు.మొక్కని దేవుడు ఉండడు. చికిత్స కోసం పెట్టే ఖర్చుకి లెక్క ఉండదు. అయితే  నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు దీనికో పరిష్కారాన్ని కనుగొన్నారు. ఎన్నో సంవత్సరాలనాటి ఓ చిన్నపాటి చికిత్సతో సంతోనలేమికి చెక్ పెట్టవచ్చని నిరూపించారు.


అదేంటంటే  సంతానలేమి ఉన్న స్త్రీలలో, సంతానాన్ని ఉత్పత్తి చేసే భాగాలలో ఏదన్నా లోపం ఉందా అని తెలుసుకునేందుకు ఓ పరీక్ష చేసేవారట. ఈ పరీక్ష ను హిస్టీరియో సాల్ఫినోగ్రఫీ  (hysterosalpingography  HSG) అంటారు. ఇందులో భాగంగా అండాలను ఉత్పత్తి చేసే ఫాలోపియన్ ట్యూబ్స్  స్పష్టంగా కనిపించేందుకు అందులోకి ఏదన్నా ద్రవపదార్థాన్ని పంపి ఫాలోపియన్  ట్యూబ్స్ ను శుభ్రం చేసేవారు. అయితే  ఈ పరీక్ష కోసం అప్పట్లో  గసగసాల నుంచి తీసిన నూనెని (iodised poppy seed oil) నింపేవారు. ఆశ్చర్యంగా ఇలా గసగసాల నూనెతో ఫాలోపియన్ ట్యూబ్స్ ని  శుభ్రం చేయగానే చాలామందిలో సంతానం కలుగుతుండేది అంట. అంటే ఈ పరీక్ష కాస్తా ఇప్పుడు  చికిత్సగా మారిపోయిందన్నమాట! 
ఇప్పుడు సంతానలేమికి కారణాలను పరీక్షించేందుకు, లోపాలను సవరించేందుకు ఆధునికమైన చికిత్సలు అందుబాటులోకి వచ్చేశాయి. కానీ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్లోని 27 వైద్య బృందాలతో కలిసి మళ్లీ ఆనాటి చికిత్సలోని ప్రామాణికతను గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం సంతానలేమితో బాధపడుతున్న 1119 మంది స్త్రీలను వారు ఎంపిక చేసుకున్నారు



ప్రయోగం కోసం ఎంచుకున్న స్త్రీలలో కొంతమందికి ఫాలోపియన్ ట్యూబ్ లో  గసగసాల నూనెతో ఫ్లష్ చేశారు. మరికొందరికి కేవలం మామూలు నీటితో ఫ్లష్ చేశారు. ఆరునెలలు తిరిగేసరికి నూనెతో చికిత్స పొందినవారిలో 40 శాతం మంది సంతానాన్ని పొందారు. నీటితో ఈ చికిత్సని పొందినవారు 29 శాతం మంది మాత్రమే సంతానాన్ని పొందారు. ఇలా ఈ నూనె ని ట్యూబ్స్ లో పంపడం వల్ల ఏమయినా మలినాలు ట్యూబ్స్ లో అడ్డుగా ఉంటే అవి తొలగిపోయి న  సంతానం సాధ్యపడుతూ ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. గసగసాల నూనె వల్ల అందులో చేరిన ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోయేందుకు ఆస్కారం లభిస్తూ ఉంటుందట. .అయితే  సంతానం కోసం వైద్యులని సంప్రదించేవారు కూడా  ఒకసారి ఈ చికిత్స గురించి వైద్యుని సంప్రదిస్తే బాగుంటుంది.  గసగసాల నుంచి తీసిన నూనె ఇప్పటికీ Lipiodol® Ultra-Fluid పేరుతో ఎలాగూ అందుబాటులోనే ఉంది.ఒకసారి ఈ ఫ్లూయిడ్ తో పాలోపియన్ ట్యూబ్స్ శుభ్రం చేయించుకుని చుడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: