కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాలి ముద్దు కృష్ణమ నాయుడుపై గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి రోజా నగరి నుండి పోటీ చేసి ఓడిపోయింది. నగరి నుంచి పోటీ చేసి ఓడిపోవడమే కాకుండా చంద్రగిరి నుండి కూడా పోటీ చేసి తిరిగి అదే ఫలితాన్ని పొందింది. అయితే ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల రోజా తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వచ్చేసి  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.


అలా జాయిన్ అయిన తర్వాత తిరిగి నగరి నుండి పోటీ చేసింది రోజా. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం విజయం సాధించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక ఇప్పుడు ఆమోదం పొంది, వచ్చే 2026 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఓకే అయినట్లయితే ఆ నియోజకవర్గం మహిళా నియోజకవర్గం అవుతుంది. అప్పుడు ఒక్కసారి రోజా గెలిస్తే ఆమెకు ఆ తర్వాత తిరుగుండదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


నియోజకవర్గ పునర్విభజన సమయంలో నియోజకవర్గాల లెక్క అయితే  పెరుగుతుందట. 25 లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య పెరగకుండా మహిళలకు33% రిజర్వేషన్ అమలయితే ఎనిమిది స్థానాలు మహిళలకు కేటాయించాలి. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో  నియోజకవర్గాల సంఖ్య పెరిగితే స్థానాల సంఖ్య కూడా పెరుగుతుందని తెలుస్తుంది. తద్వారా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న మొదటి 8 నియోజక వర్గాలను మహిళలకు కేటాయించవచ్చు.


ఆ రకంగా గుంటూరు, విశాఖపట్నం , నరసరావుపేట, నెల్లూరు, తిరుపతి ఎస్సీ నంద్యాల, అనంత పురం, విజయవాడ నియోజకవర్గాల్లో మహిళలకు రిజర్వేషన్ అవకాశాలు ఉంటాయి. వీటిలో నగర ప్రాంతాలే అధికం.   రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 175 శాసన సభ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. ఈ సంఖ్య పెరక్కుండా మహిళలకు 33% రిజర్వేషన్ అమల్లోకి వస్తే 58 స్థానాలు మహిళలకు రిజర్వ్ అవుతాయి. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న 58 శాసనసభ నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉండవచ్చు. వాటిలో రోజా ది కూడా ఒకటి అవ్వచ్చు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: