ఈ మధ్య కొందరు కొద్ది దూరం ఉన్న గమ్యస్థానాలను చేరుకోవడానికి కూడా గతంతో పోలిస్తే కార్లనే ఎక్కువగా వాడుతున్నారు. ఇందుకు గాను ఓలా, ఉబర్ లాంటి రవాణా కంపెనీలు ఎన్ని ఉన్నప్పటికీ కాకపోతే కార్ మన చేతికి ఇవ్వరు. అయితే తమంతటా తామే డ్రైవింగ్ చేసుకునే వారికైతే జూమ్ కారు లాంటి వాహనాల రెంటల్ సంస్థలు కూడా సిటీలలో అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీల నుండి  కార్లను అద్దెకు తీసుకునే సదుపాయం ఉంటుంది.

 

ఇక అసలు విషయానికి వస్తే తాజాగా జూమ్ కార్ సంస్థ ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఇచ్చింది. కంపెనీ " నెవర్ స్టాప్ లివింగ్ " అంటూ కార్ల రెంటల్ ప్లాట్ ఫామ్ లో 100% వరకు ఆఫర్ ను ఇచ్చింది. అయితే ఇందులో ముందుగా కార్ బుక్ చేసుకున్నవారికి ఫ్లాట్ 50% తగ్గింపు ఇచ్చింది. అంతే కాకుండా 50% క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కూడా మన ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫర్ ని కేవలం ఏప్రిల్ 27వ తారీకు నుండి ఏప్రిల్ 30వ తారీకు వరకు మాత్రమే అందుబాటులో ఉంచింది కంపెనీ. అయితే ఈ నాలుగు రోజుల్లో కార్ బుక్ చేసుకున్న వారు మే 4 వ తారీఖు నుండి అక్టోబర్ 24 మధ్య కాలంలో ఎప్పుడైనా ఈ ఆఫర్ ని వినియోగించవచ్చు అని జూమ్ సంస్థ ఇచ్చింది. అంతేకాదు ఫ్రీగా రీషెడ్యూల్ చేసుకుని ఆప్షను కూడా సంస్థ ఇచ్చింది. అయితే ఇది 2021 సంవత్సరం రాకముందే వీటిని రీషెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా వారి సొంత డ్రైవింగ్ చేసుకొని కార్ తీసుకొని వెళ్లాలనుకునే వారికి ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుంది.


అయితే ఈ ఆఫర్ కోసం బుక్ చేసుకోవాలంటే ముందుగా కొంత మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అమౌంట్ పూర్తిగా రిఫండ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ఆఫర్ ని ఉపయోగించుకోవాలంటే జూమ్ 100 అనే ప్రోమో కోడ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా క్యాన్సిలేషన్ చార్జెస్ ఏవిధంగా చార్జ్ చేయబడవు.

మరింత సమాచారం తెలుసుకోండి: